విజిల్స్ వేయడానికి సిద్ధమవ్వండి.. 'దేవర' ఇంటర్వెల్ బ్యాంగ్.. థియేటర్ దద్దరిల్లిపోతుందట?
హై ఇంటెన్స్ యాక్షన్ డ్రామాగా వస్తున్న "దేవర"పై భారీ ఎత్తున అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో ఇంటర్వెల్ సీక్వెన్స్ హైవోల్టేజ్ లో ఉంటూ ప్రేక్షకులకి గూస్ బంప్స్ తెప్పించేలా ఉంటుందని ప్రస్తుతం ఒక టాక్ నడుస్తోంది. ఈ ఇంటర్వెల్ బ్యాంగ్‌లో తారక్ హీరోయిజాన్ని ఎలివేట్ చేయనున్నారట. అలా కొరటాల ఇంటర్వెల్ యాక్షన్ సీక్వెన్స్ డిజైన్ చేశారని అంటున్నారు. ఈ సీన్లకు థియేటర్లలో విజిల్స్ పడటం పక్కా అని కూడా పేర్కొంటున్నారు.
సెకండాఫ్ చూడాలని ఇంట్రెస్ట్ కలగాలంటే, క్యూరియాసిటీ తారా స్థాయిలో పెరగాలంటే కచ్చితంగా పూనకాలు తెప్పించే ఇంటర్వెల్ బ్యాంగ్ ఉండాల్సిందే. పరిటాల శివకి ఆ విషయం తెలియంది కాదు. ఈ ఇంటర్వెల్ బ్యాంగ్ ఆడియన్స్, క్రిటిక్స్, రివ్యూలు, పబ్లిక్ టాక్ లో ప్రత్యేకంగా చెప్పుకుంటారు. ఇదే సినిమా రిజల్ట్ ని కూడా ప్రభావితం చేస్తుంది. అందుకే మేకర్స్ అందరూ కూడా ఈ ఇంటర్వెల్ బ్యాంగ్ అద్భుతంగా ఉండేలాగా కృషి చేస్తారు.
వీలైనంత కొత్తగా ఉండేలాగా జాగ్రత్త పడతారు. 'దేవర' మూవీ ఇంటర్వెల్ యాక్షన్ సీక్వెన్స్ ని కూడా కొరటాల శివ చాలా డిఫరెంట్ గా చూపించాడట. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ఓ ఇంటర్వ్యూలో తెలియజేయడం జరిగింది. కొరటాల మాట్లాడుతూ.. "ఇంటర్వెల్ సీక్వెన్స్‌లో వచ్చే సీన్లు హీరోని, సినిమాని బాగా ఎలివేట్ చేస్తాయి. హెవీ బ్లడ్ బాత్ స్క్రీన్‌ను ఎరుపెక్కిస్తుంది. ఈ సీక్వెన్స్ వార్ ఫైర్ అయినప్పటికీ ఓ చాలా అందమైన పెయింటింగ్ లా తీర్చిదిద్దాము. టీజర్ లో చూపించినట్లు ఆకాశంలో చంద్రవంకను బ్లడ్ షాట్ సంపూర్ణంగా మారుస్తుంది." అని తెలిపాడు
విజువల్ ప్రెజెన్స్‌లో పోయెటిక్ వైఫ్ వచ్చేలాగా సినిమా సీన్లను తాము డిజైన్ చేశామని వెల్లడించాడు. "ఎరుపెక్కిన సముద్రంతో తీరం చూస్తుంటే కలిగే ఫీలింగే వేరు. ఈ సీక్వెన్స్ చూస్తున్నంత సేపు ఓ గొప్ప పెయింటింగ్ చూసిన ఎక్స్పీరియన్స్ కలుగుతుంది. హింసాత్మకంగా అనిపించదు." కొరటాల శివ మరింత వివరించాడు. కొరటాల ఈ కామెంట్స్ చేశాక ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి ఈ సీక్వెన్స్ చూడాలనే కుతూహలం బీభత్సంగా పెరిగింది. శివ కామెంట్స్ తర్వాత థియేటర్ దద్దరిల్లి పోతుందేమో అని పలువురు కామెంట్లు చేస్తున్నారు. 'ఆచార్య'తో డిజాస్టర్ అందుకున్న కొరటాల 'దేవర' మూవీతో మాత్రం ఒక బాహుబలి, ఒక పుష్ప లాంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంటాడేమో అని అనిపిస్తోంది.
'ఆచార్య' ఇంపాక్ట్ 'దేవర'పై పెద్దగా లేదు ఎందుకంటే కొరటాల శివ కూడా 'దేవర' సినిమా కోసం చాలా కష్టపడ్డాడు. కథ విషయంలో కూడా అనేక జాగ్రత్తగా తీసుకున్నాడు. నిజసంఘటనల స్ఫూర్తితో చాలా కొత్తగా ఈ సినిమాని తీసుకొస్తున్నాడు. పైగా ఇందులో ఎన్టీఆర్. తండ్రీకొడుకులుగా రెండు పాత్రలలో అతడు చించేసాడు. మ్యూజిక్ కూడా బాగానే ఉంది. ట్రైలర్లు చూస్తుంటే స్టోరీ కూడా బాగానే ఉంటుందేమో అనిపిస్తుంది. ఇంకొద్ది గంటల్లో ఈ మూవీ రిజల్ట్ తెలిసిపోతుంది.