టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక మంచి గుర్తింపును ఏర్పరచుకున్న దర్శకులలో కొరటాల శివ ఒకరు. ఈయన తాజాగా జూనియర్ ఎన్టీఆర్ హీరోగా రూపొందిన దేవర పార్ట్ 1 మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ సినిమా రేపు అనగా సెప్టెంబర్ 27 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల కానుంది. ఈ సినిమాపై దేశ వ్యాప్తంగా మాత్రమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇక కొరటాల ఆఖరుగా ఆచార్య అనే సినిమాకు దర్శకత్వం వహించి భారీ అపజయాన్ని ఎదుర్కొన్నాడు. దానితో ఈయన కెరియర్ గ్రాఫ్ కాస్త పడిపోయింది.
మళ్ళీ తను దేవర పార్ట్ 1 మూవీ తో సూపర్ సక్సెస్ ను అందుకొని తిరిగి కం బ్యాక్ ఇవ్వాలి అని ఆయన చూస్తున్నాడు. ఇకపోతే దేవర సినిమా కోసం కొరటాల సరికొత్త స్క్రీన్ ప్లే ను డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. అదే రివర్స్ స్క్రీన్ ప్లే అని ఓ వార్త వైరల్ అవుతుంది. అసలు విషయం లోకి వెళితే ... దాదాపుగా కమర్షియల్ సినిమాలలో మొదటి అర్థ భాగంలో హీరో లవ్ స్టోరీ , చిన్న కామెడీ సీన్స్ , పాటలతో సినిమాను ముందుకు తీసుకువెళ్లి సెకండాఫ్ లో హీరో , విలన్ల మధ్య పోరు. భారీ యాక్షన్స్ సన్నివేశాలను చూపిస్తూ ఉంటారు. కానీ కొరటాల ఈ సినిమాను డిఫరెంట్ స్క్రీన్ ప్లే తో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది.
అందులో భాగంగా ఈ సినిమా మొదటి భాగంలోనే హీరో , విలన్ మధ్య ఘర్షణ సన్నివేశాలు , పవర్ఫుల్ షార్ట్స్ ఉండబోతున్నట్లు , ఇక సెకండ్ హాఫ్ లో హీరో , హీరోయిన్ మధ్య రొమాన్స్. లవ్ స్టోరీ , పాటలు , కామెడీ సన్నివేశాలు ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇలా రివర్స్ స్క్రీన్ ప్లే తో కొరటాల మరో హిట్ ను అందుకుంటాడేమో చూడాలి.