జూనియర్ ఎన్టీఆర్ తాజాగా దేవర అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ రేపు అనగా సెప్టెంబర్ 27 వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమాలో బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ , ఎన్టీఆర్ కు జోడిగా కనిపించబోతోంది. ఈ సినిమాతోనే ఈ బ్యూటీ తెలుగు తెరకు పరిచయం కానుంది. మూవీ లో ప్రధాన ప్రతి నాయకుడి పాత్రలో సైఫ్ అలీ ఖాన్ కనిపించబోతుండగా , అనిరుద్ రవిచంద్రన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు.
ఇది ఇలా ఉంటే ఆర్ ఆర్ ఆర్ లాంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత ఎన్టీఆర్ నటించిన సినిమా కావడం ఎన్నో సూపర్ సక్సెస్ ఫుల్ సినిమాలకు దర్శకత్వం వహించిన కొరటాల శివ ఈ మూవీ కి దర్శకత్వం వహిస్తూ ఉండడం , ఈ మూవీ రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుండడంతో ఈ మూవీ పై మొదటి నుండి ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్న నేపథ్యంలో ఈ సినిమాను అత్యంత భారీ ధరకు మేకర్స్ అమ్మివేస్తారేమో అని జనాలు భావించారు. కానీ ఈ మూవీ యూనిట్ మాత్రం ఈ సినిమాను కేవలం 180 కోట్ల ధరకే ప్రపంచ వ్యాప్త థియేటర్ హక్కులను అమ్మి వేసినట్లు తెలుస్తోంది. దానితో ఈ సినిమా టార్గెట్ చాలా చిన్నగానే ఉంది. ఈ మూవీకి బ్లాక్ బస్టర్ టాక్ వచ్చినట్లు అయితే అవలీలగా ఈ మూవీ మొదటి వీకెండ్ పూర్తి అయ్యే సరికి బ్రేక్ ఈవెన్ ఫార్ములా ను కంప్లీట్ చేసుకునే అవకాశం ఉంది.
మరి మొదటి వీకెండ్ పూర్తి అయ్యే సరికి ఈ మూవీ బ్రేక్ ఈవెన్ ఫార్ములాను కంప్లీట్ చేసుకున్నట్లయితే ఈ సినిమాకు భారీ ఎత్తున లాభాలు వచ్చే అవకాశం చాలా వరకు ఉంటుంది. తెలుగు సినిమాలలో అత్యధిక లాభాలను అందుకున్న సినిమాలలో ఎక్కువ సినిమాలు రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన సినిమాలే ఉన్నాయి. ఒక వేళ ఈ మూవీ కి మంచి టాక్ వచ్చినట్లు అయితే ఈ మూవీ రాజమౌళి సినిమా రికార్డులను దాటేసే అవకాశం చాలా వరకు ఉంది. మరి ఈ మూవీ ఎలాంటి టాక్ ను తెచ్చుకొని ఏ స్థాయి కలెక్షన్లను వసూలు చేస్తుందో చూడాలి.