బిగ్ బాస్ -8 హౌస్ లో ప్రమాదం.. ఏం జరిగిందంటే..?

Divya
ప్రస్తుతం అన్ని భాషలలో కూడా ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ మొదలైంది.. మూడు వారాల క్రితమే తెలుగులో బిగ్ బాస్-8 సీజన్ మొదలు కాక ఇప్పటికే కొంతమంది కంటెస్టెంట్స్ ఎలిమెంట్ అయ్యారు. ఇటీవలే హిందీ బిగ్ బాస్ కూడా 18వ సీజన్ మొదలు కాబోతున్నట్లుగా ఒక ప్రోమోను కూడా రిలీజ్ చేశారు. అలాగే తమిళ బిగ్ బాస్ సీజన్ -8 హోస్టుగా ఎవరు ఉండబోతున్నారనే విషయం పైన  ఇప్పటికీ ఒక క్లారిటీ రాలేదు .ఇలాంటి సమయంలోనే తమిళ బిగ్ బాస్ హౌస్ చంబరంబాక్కం పక్కన ఉన్నటువంటి ఫిలిం సిటీలో గ్రాండ్ గా సెట్ పనులు జరుగుతున్నాయట.

హౌస్ లో పాటు ఇక్కడ పలు సీరియల్స్ సినిమా రియాల్టీ షోలో షూటింగు కూడా సంబంధించిన సెట్టింగ్స్ జరుగుతూ ఉంటాయట ఈ క్రమంలోనే.. బిగ్బాస్ చెట్టును ఏర్పాటు చేస్తున్న సమయంలో చాలామంది ఉద్యోగులు పనిలో నిమగ్నమై ఉండగా.. ఒక ఉద్యోగి 20 అడుగుల ఎత్తు నుంచి పడిపోవడంతో అతని చేయి విరగడమే కాకుండా తుంటి ఎముక విరిగినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వెంటనే అక్కడ సిబ్బంది హుటాహుటిగా ఆ వ్యక్తిని ఆసుపత్రికి తీసుకువెళ్లాక అత్యవసర చికిత్స చేయించినట్లు సమాచారం. ఈ ఘటన పైన కూడా పోలీసులు కేసు నమోదు చేశారు.

బిగ్ బాస్ సెట్ పనులు చూస్తున్న వ్యక్తి ఉత్తరప్రదేశ్ ప్రాంతానికి చెందిన మహమ్మద్ షాహిద్ ఖాన్ గా పోలీసులు గుర్తించారు. అయితే ఈ విషయం విన్న ఒక్కసారిగా బిగ్ బాస్ ఫాన్స్ లో కలకలం రేపుతోంది. ఇటీవల కమలహాసన్ కూడా హోస్ట్ నుంచి తప్పుకోవడం జరిగింది. ఈసారి విజయ్ సేతుపతి హోస్ట్ గా రాబోతున్నారనే వార్తలు అయితే వినిపిస్తున్నాయి. వచ్చే నెల 6వ తేదీ నుంచి ఈ సీజన్ మొదలు కాబోతోంది. మరి ఎవరెవరు కంటెస్టెంట్స్ అన్న విషయం తెలియాలి అంటే మరో కొద్ది రోజులు ఆగాల్సిందే..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: