కనుమరుగైన నటులను ఫుల్ గా వాడేస్తున్న బోయపాటి.. ఇప్పటికే వారితో ఫుల్ సక్సెస్..?

MADDIBOINA AJAY KUMAR
సినిమా ఇండస్ట్రీలో ఉన్న దర్శకులలో కొంత మంది అద్భుతమైన క్రేజ్ ఉన్న నటులతో సినిమాలను రూపొందిస్తూ ఉంటారు . అలా క్రేజ్ ఉన్న వారి తో సినిమాలు చేయడం వల్ల సినిమాలకు అదనపు బజ్ ఏర్పడుతూ ఉంటుంది . దానితో చాలా మంది ఈ రూట్ నే ఎంచుకుంటూ ఉంటారు . ఇక మరి కొంత మంది దర్శకు లు పెద్దగా క్రేజీ లేని నటులను , ఒకప్పుడు క్రేజ్ ఉండి ప్రస్తుతం పెద్దగా గుర్తింపు లేకుండా కెరియర్ను కొనసాగిస్తున్న వారి తో సినిమాలను తెరకెక్కిస్తూ ఉంటారు.

అలాంటి వారిలో బోయపాటి శ్రీను ఒకరు. ఈయన ఇప్పటి వరకు ఎన్నో సినిమాలకు దర్శకత్వం వహించి అందులో ఎన్నో మూవీలలో అద్భుతమైన విజయాలను అందుకుని టాలీవుడ్ ఇండస్ట్రీ లో దర్శకుడిగా తనకంటూ ఒక మంచి గుర్తింపును ఏర్పరచుకున్నాడు. ఇకపోతే ఈయన తన సినిమాలలో ఎక్కువ శాతం ఒకప్పుడు సూపర్ క్రేజ్ ఉండి నటులుగా కెరియర్ను కొనసాగించి ప్రస్తుతం మాత్రం పెద్దగా గుర్తింపు లేకుండా కెరియర్ను కొనసాగిస్తున్న వారిని పెట్టుకోవడానికి ఆసక్తిని చూపిస్తూ ఉంటాడు. అందులో భాగంగా హీరోగా వరస అపజయాలను అందుకుంటూ కెరియర్ ఆల్మోస్ట్ డౌన్ ఫాల్ అయిన జగపతి బాబు ను లెజెండ్ సినిమాలో విలన్ గా ఎంచుకున్నాడు.

ఈ మూవీ తో  జగపతి బాబు కి సూపర్ సాలిడ్ క్రేజ్ వచ్చింది. ఇక శ్రీకాంత్ ను కూడా అలాగే అఖండ సినిమాలో విలన్ పాత్రలో తీసుకున్నాడు. ఆ తర్వాత ఈయన కెరియర్ కూడా అద్భుతమైన జోష్ లో ముందుకు  సాగుతుంది. కొన్ని సంవత్సరాల క్రితం అద్భుతమైన జోష్ లో కెరియర్ ను సాగించిన వేణు ను కూడా దమ్ము సినిమాలో ఓ కీలకమైన పాత్రలో తీసుకున్నాడు. ఈ సినిమాతో ఈ నటుడికి కూడా మంచి గుర్తింపు వచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: