KBC లో కోటి రూపాయల ప్రశ్న.. కంటెస్టెంట్ ఫెయిల్.. మీరు చెప్పగలరా?

praveen

కేబిసి ( కౌన్ బనేగా కరోడ్ పతి) బుల్లితెర షో గురించి జనాలకి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. దాదాపు దశాబ్ద కాలానికి పైగా బాలీవుడ్ లో ఈ షో నేటికీ నిరాటంకంగా కొనసాగుతూ వస్తుంది. ఇక ఈ షో హోస్ట్ గురించి కూడా చెప్పాల్సిన పని లేదు. బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్ ఈ షోని నిర్వహిస్తూ ఉంటారు. ప్రతి సంవత్సరం ఈ షోలో పాల్గొని కోటి రూపాయలు గెలవడం కోసం ఎన్నో కోట్లమంది ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ, ఏ కొద్దిమందినో ఇక్కడ తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటూ ఉంటారు. అందుకే ఈ షో అత్యధిక ప్రజాదరణ కలిగిన షో గా పేరు ప్రఖ్యాతలు గడించింది.
ఇకపోతే ప్రస్తుతం కౌన్ బనేగా కరోడ్పతి 16వ సీజన్ నడుస్తోంది. కాగా, ఈ సీజన్లో పాలుపంచుకున్న ఒక కంటెస్టెంట్ కోటి రూపాయల దాకా వచ్చి జస్ట్ మిస్ అయ్యాడు. కట్ చేస్తే... 50 లక్షలు రూపాయలు మాత్రమే గెలుచుకొని ఇంటి బాట పట్టాడు. కటిక పేదవాడు అయిన ఉజ్వల్ ప్రతాప్ ఎన్నో ఆశలు పెట్టుకుని షో లో పాలుపంచుకున్నాడు. కానీ 50 లక్షల రూపాయల తరువాత వచ్చిన ప్రశ్నకి సరైన సమాధానం చెప్పకపోవడంతో తీవ్రమైన నిరాశ చెందుతూ... ఇంటి బాట పట్టడం జరిగింది. అయితే ఈ విషయంలో ప్రేక్షకులు కూడా ఫీలయ్యారు. ఉజ్వల్ ప్రతాప్ అంత పేదవాడు మరి. వారి తల్లిదండ్రులు కుండలు తయారు చేసుకుంటూ బతుకుతారు. కూలి ఆడితే గాని కొండ ఆడదు వారి ఇంట్లో! దాంతో చాలామంది ఆయనపై సానుభూతి ప్రకటించారు. కానీ అప్పటికే లైఫ్ లైన్లను వినియోగించుకున్న ప్రతాప్, ఇక ఏమీ చేయలేక వెనుతిరిగాడు.
ఇంతకీ ఆ కోటి రూపాయల ప్రశ్న ఏమిటంటే? 1919 లో జరిగిన మొదటి ప్రపంచ యుద్ధంలో భారతదేశానికి చెందిన ఏ రాజ్యం శేషకుడు త్రీ టీ ఆఫ్ వర్ష సైలెస్ పైన సంతకం చేసాడు? ఇదే ప్రశ్న ప్రతాప్ ని అడగడంతో చెప్పలేకపోయారు. దీనికి ఆప్షన్లుగా.. A. మహారాజా సవాయి జై సింగ్, B. నిజాం మీ ఉస్మాన్ అలీ ఖాన్, C. నమేద్ హమీదుల్లా ఖాన్, D. మహారాజా గంగా సింగ్.... అనే వాటిని ఇవ్వగా ఆయన సరియైన సమాధానం చెప్పకపోవడంతో 50 లక్షలు మాత్రమే అందుకుని ఎమోషనల్ అయ్యాడు. ఇక ఈ ప్రశ్నకు మీరు సమాధానం చెప్పగలిగితే కింద కామెంట్ చేయండి... త్వరగా! అంతేగాని ఇక్కడ ఆన్సర్ చూసేయొద్దు. పోతే దీనికి ఆన్సర్ D. మహారాజా గంగా సింగ్. ఇక ఈ ఆన్సర్ని చెప్పిన తర్వాత బిగ్ బి అమితాబ్ బచ్చన్ ప్రతాప్ ని కౌగిలించుకొని వీడ్కోలు పలికారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: