నాగచైతన్య రామ్ ల ఆశలు ఆవిరి !

Seetha Sailaja
ఈ సంవత్సరం తెలుగు ఫిలిమ్ ఇండస్ట్రీ వర్గాలు అత్యంత ఆశక్తిగా ఎదురు చూస్తున్న మూడు భారీ సినిమాలలో రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’ ఒకటి. వాస్తవానికి ఈ సినిమా ఈపాటికే విడుదల కావలసి ఉన్నప్పటికీ దర్శకుడు శంకర్ ఈ మూవీ నిర్మాణంలో చేసిన ఆలస్యం వలన ఎట్టకేలకు ఈ మూవీ డిసెంబర్ 20న విడుదల కాబోతున్నట్లు ఈ మూవీ బయ్యర్లకు సంకేతాలు వస్తున్నట్లు వార్తలు ఇండస్ట్రీ వర్గాలలో వస్తున్నాయి.

డిసెంబర్ లో రాబోతున్న క్రిస్మస్ సీజన్ ను టార్గెట్ చేస్తూ ఈ మూవీ విడుదల అవుతున్న నేపధ్యంలో ఈ డేట్ పై ఎన్నో ఆశలు పెట్టుకున్న నాగచైతన్య నితిన్ ల ఆశలు గల్లంతు అయినట్లు సంకేతాలు వస్తున్నాయి. నాగచైతన్య కెరియర్ లో భారీ బడ్జెట్ తో తీసిన ‘తండేల్’ నితిన్ ఎన్నో ఆశలు పెట్టుకుని క్రిస్మస్ కు రావాలి అనుకున్న రాబిన్ హుడ్ సినిమాలు తమ విడుదల ప్లాన్స్ ను మార్చుకుని చరణ్ కు లైన్ క్లియర్ చేయడం తప్ప మరొక మార్గం లేని పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది అంటూ ఇండస్ట్రీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

వాస్తవానికి ఈ రెండు సినిమాలను సంక్రాంతి రేస్ కు తీసుకు రావాలని మేకర్స్ భావించినప్పటికీ ఇప్పటికే సంక్రాంతి రేస్ కు విడుదల అయ్యే సినిమాల సంఖ్య విపరీతంగా పెరిగి పోవడంతో రామ్ నాగచైతన్యలకు సంక్రాంతి అవకాశం కూడ మిస్ అయింది అంటున్నారు. దీనితో ఈ ఇద్దరి హీరోలకు వచ్చే సంవత్సరం ఫిబ్రవరి తప్ప తమ సినిమాల విడుదలకు మరొక మార్గం లేదు అంటూ అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

ఈవారం విడుదల కాబోతున్న ‘దేవర’ డిసెంబర్ లో విడుదల కాబోతున్న ‘పుష్ప 2’ ‘గేమ్ ఛేంజర్’ సినిమాల ఫలితం పై భవిష్యత్ లో విడుదల కాబోయే భారీ సినిమాల బిజినెస్ ఆధారపడి ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ చైతన్య నితిన్ లకు ‘గేమ్ ఛేంజర్’ ఊహించని షాక్ ఇచ్చింది అనుకోవాలి..  


 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: