కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈయన ఉగ్రం అనే మూవీతో దర్శకుడిగా కెరియర్ను మొదలు పెట్టాడు. ఈ మూవీతోనే ప్రశాంత్ మంచి విజయాన్ని అందుకొని కన్నడ సినీ పరిశ్రమలో దర్శకుడిగా తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఆ తర్వాత ఈయన యాష్ హీరోగా కేజిఎఫ్ చాప్టర్ 1 అనే పాన్ ఇండియా మూవీ ని రూపొందించాడు. ఈ మూవీ అద్భుతమైన విజయం అందుకుంది. ఈ సినిమాతో ప్రశాంత్ కి దేశ వ్యాప్తంగా గుర్తింపు లభించింది. కేజిఎఫ్ చాప్టర్ 2 కూడా సూపర్ సక్సెస్ కావడంతో ఈ దర్శకుడి క్రేజ్ మరింతగా పెరిగింది.
ఆఖరుగా ప్రశాంత్ , ప్రభాస్ హీరోగా సలార్ పార్ట్ 1 అనే మూవీ ని రూపొందించాడు. ఈ మూవీ కూడా మంచి విజయం అందుకుంది. ఇక ప్రశాంత్ నీల్ సినిమాలంటేనే బ్లాక్ థీమ్ లో ఉంటాయి. ఈయన దర్శకత్వంలో రూపొందిన ప్రతి సినిమా కూడా బ్లాక్ ధిమ్ లోనే ఉంటూ వస్తుంది. ఆఖరికి ఈయన ఏ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ను విడుదల చేసిన అది కూడా బ్లాక్ థీమ్ లోనే ఉంటూ వస్తుంది. ఇది ఇలా ఉంటే తాజాగా జూనియర్ ఎన్టీఆర్ , కొరటాల శివ దర్శకత్వంలో దేవర అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే.
ఈ మూవీ రెండు భాగాలుగా విడుదల కానుంది. అందులో మొదటి భాగాన్ని సెప్టెంబర్ 27 వ తేదీన విడుదల చేయనున్నారు. ఇప్పటివరకు ఈ మూవీ బృందం విడుదల చేసిన ప్రచార చిత్రాలు అన్నీ కూడా ప్రశాంత్ నీల్ సినిమాల మాదిరిగా బ్లాక్ థీమ్ లోనే ఎక్కువ శాతం ఉన్నాయి. దానితో చాలా మంది ప్రశాంత్ నీల్ సినిమాల మాదిరి బ్లాక్ థీమ్ ఉంది. ఆయన దర్శకత్వంలో రూపొందిన సినిమాల స్థాయిలో ఈ సినిమా కూడా ఉంటే అద్భుతంగా ఉంటుంది అని అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ వస్తున్నారు.