బిగ్ బాస్ చూడని నాగార్జున.. వీకెండ్ లో కంటెస్టెంట్స్ తప్పులు ఎలా చెబుతాడో తెలుసా?

praveen
తెలుగు బుల్లితెరపై బిగ్గెస్ట్ రియాలిటీ షోగా కొనసాగుతున్న బిగ్ బాస్ కి బుల్లితెర ప్రేక్షకుల్లో ఏ రేంజ్ లో క్రేజ్ వుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బిగ్ బాస్ ప్రారంభమైంది అంటే చాలు మిగతా షోస్ అన్నింటినీ కూడా పక్కనపెట్టి.. ఇక ఈ షోనే తెగ ఫాలో అవుతూ ఉంటారు. ప్రతి సోమవారం జరిగే నామినేషన్లు మధ్యలో బిగ్ బాస్ ఇచ్చే టాస్కులు ఇక వారాంతంలో నాగార్జున వచ్చి చేసే సందడి.

 ఎలిమినేషన్ విషయంలో ఉండే ఉత్కంఠ ఇలా అన్నింటిని కూడా ప్రేక్షకులు తెగ ఎంజాయ్ చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అయితే ప్రతి శనివారం నాగార్జున బిగ్బాస్ స్టేజ్ పైకి వచ్చి అటు హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ చేసిన తప్పులను ఒక్కొక్కటిగా ఎత్తిచూపుతూ క్లాస్ పీకుతూ ఉంటాడు. అంతే కాదు కంటెస్టెంట్స్ ఆట తీరు ఎలా ఉంది అని చెబుతూ ఉంటారు. అయితే ఈ ఎపిసోడ్ ఎంతో ఆసక్తికరంగా సాగుతూ ఉంటుంది. అయితే ఒకవైపు హీరోగా ఇంకోవైపు.. బిజినెస్మేన్ గా ఫుల్ బిజీ ఉండే నాగార్జున బిగ్బాస్ పూర్తి ఎపిసోడ్లను ఎలా చూస్తారు అని డౌట్ చాలా మందిలో ఉంటుంది.

 ఒకవేళ చూడకపోతే వారం మొత్తం హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ చేసిన తప్పులు ఎలా తెలుస్తాయి అని అందరూ అనుకుంటారు. నిజానికి ఈయన షో మొత్తం చూడడు. మనం మొదటి నుంచి చెప్పుకున్నట్లుగానే ఈ షో మొత్తం స్క్రిప్ట్ బేస్డ్ గానే నడుస్తూ ఉంటుంది. కాబట్టి నాగార్జున ఏం మాట్లాడాలో ఎవరెవరు ఏం మాట్లాడుతున్నారు. దానికి కౌంటర్గా నాగార్జున ఎలాంటి మాటలు మాట్లాడాలి అనేది ముందుగానే అతనికి రైటర్లు అందరూ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. తర్వాత పిసిఆర్ రూమ్ నుంచి నాగార్జున పెట్టుకున్న ఇన్ ఇయర్ ద్వారా రైటర్ నాగార్జునకి ఏం మాట్లాడాలి అనేది ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూ ఉంటారు. అందుకే పరిస్థితికి తగ్గట్లుగా  నాగార్జున మాట్లాడుతూ ఉంటాడు. ఇలా రైటర్ రాసిన దాన్ని నాగార్జున నోటి నుంచి పలికిస్తాడు తప్ప షో మొత్తం చూసి ఎవరు తప్పు చేశారు. ఎవరు ఒప్పు ఒక చేశారు అని చూస్తూ కూర్చునంత టైం ఆయనకు లేదు. ఎవరి మీద రెస్పాండ్ అవ్వాలి అనే విషయాన్ని  నాగార్జునకు ముందుగానే షో డైరెక్టర్ కూడా చెబుతూ ఉంటారు. అందుకే నాగార్జున కేవలం కొంతమందిని మాత్రమే టార్గెట్ చేయడం చూస్తూ ఉంటాం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: