ఎడిటింగ్ తర్వాత ఇడియట్ లో ఆ సీన్స్.. లేకుంటే ఫ్లాప్ అయ్యదా..?

Pulgam Srinivas
కొన్ని సంవత్సరాల క్రితం సినిమాల్లో కథకు సంబంధం లేకపోయినా కామెడీ ట్రాక్ లను పెట్టేవారు. ప్రేక్షకులు కూడా వాటిని పెద్దగా ఇబ్బంది పడేవారు కాదు. దానితో చాలా మంది దర్శక , నిర్మాతలు కచ్చితంగా కామెడీ ట్రాక్స్ సినిమాలలో ఇన్వాల్వ్ చేసేవారు. కానీ ప్రస్తుతం పరిస్థితులు చల్ వరకు మారాయి. అనవసరంగా ఏదైనా కామెడీ ట్రాక్ వచ్చింది అంటే ప్రేక్షకులు డిస్టబెన్స్ ఫీల్ అవుతున్నారు. దానితో ఈ మధ్యకాలంలో అనవసరపు కామెడీ ట్రాక్స్ సినిమాల్లో చాలా వరకు తగ్గిపోయాయి. ఇకపోతే కొంత కాలం రవితేజ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఇడియట్ అనే మూవీ వచ్చిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది.

ఈ సినిమాలో ఆలీ ఓ పాత్రలో నటించాడు. ఈ మూవీ కి ఎడిటర్ గా పని చేసిన మార్తాండ్ కె వెంకటేష్ ఈ సినిమా గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియజేశాడు. ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ... ఇడియట్ సినిమా మొత్తం పూర్తి అయింది. ఎడిటింగ్ కూడా కంప్లీట్ అయింది. సినిమా బాగానే ఉంది కానీ అంతా ఓకే ఫ్లో లో వెళుతుంది. అది ఏమైనా ప్రాబ్లం అవుతుందా అని మేము అనుకున్నాం. దానితో అదే విషయాన్ని పూరి జగన్నాథ్ గారికి చెప్పాము. సినిమా అంతా ఓకే ఫ్లో లో వెళుతుంది. మధ్యలో ఏదైనా కామెడీ ట్రాక్ ఉంటే జనాలు కాస్త రిలాక్స్ అవుతూ సినిమా చూస్తారు అని అన్నాను.

దానితో వెంటనే ఆయన ఆలీ గారితో ఓ కామెడీ ట్రాక్ ను రెడీ చేసి , దానిని పూర్తి చేసి ఆ తర్వాత సినిమాలో దాన్ని యాడ్ చేశాం. ఇక దానికి అద్భుతమైన రెస్పాన్స్ జనాల నుండి వచ్చింది అని మార్తాండ్ కె వెంకటేష్ ఓ ఇంటర్వ్యూలో తెలియజేశారు. ఇకపోతే ఇడియట్ సినిమాలోని ఆలీ ట్రాక్ కి ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి ఆ సమయంలో అద్భుతమైన ప్రశంసలు దక్కాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Rt

సంబంధిత వార్తలు: