ఎలిమినేషన్ అయ్యాక.. అభయ్ ఎమోషనల్ వీడియో.. ఏం చెప్పాడో తెలుసా?

praveen

బుల్లితెరపై టాప్ రేటింగ్ తో దూసుకుపోతున్న బిగ్ బాస్ 8 తెలుగు సీజన్ విజయవంతంగా మూడు వారాలు పూర్తి చేసుకుంది. ఇక ఎవ్వరు ఊహించలేని విధంగా అభయ్ నవీన్ మూడో వారంలోనే ఎలిమినేట్ కావడం తన అభిమానులను నిరాశ నిస్పృహలకు గురిచేసింది. మునిపటి సీజన్ల కంటే కూడా ఎనిమిదవ సీజన్ చాలా రసభరితంగా సాగుతోంది. సరదా సరదాగా, ట్విస్టులు మీద ట్విస్టులతో సాగిపోతున్న బిగ్ బాస్ షో ప్రస్తుతం బుల్లితెరపై మంచి టిఆర్పి రేటింగ్ నమోదు చేస్తోందని నిర్వాహకులు తాజాగా ఓ మీడియా వేదికగా చెప్పుకు రావడం జరిగింది. ఇక అభయ నవీన ఎలిమినేషన్ ప్రక్రియ ఏ విధంగా జరిగిందో మీకు తెలిసే ఉంటుంది?
అభయ్ నవీన్ తన నోటి దురుసు మూలంగా తొందరగానే ఎలిమినేట్ కావడం జరిగింది. లేదంటే బిగ్బాస్ షో లోనే పాల్గొని, బిగ్ బాస్ పైనే సెటైర్లు వేస్తే వారికి కాలకుండా ఉంటుందా? ఎక్కడ కూడా సరిగ్గా అదే జరిగింది. తన మాటలతో బిగ్ బాస్ ఎంటర్టైన్ అవుతాడని భావించిన అభయ్ నవీన్ కి చుక్కెదురు అయింది. దాంతోనే బిగ్ బాస్ హౌస్ లో నుండి గెంటివేయబడ్డాడు.
ఇక ఈ నేపథ్యంలోనే అభయ్ నవీన్... సోషల్ మీడియాలో ఓ వీడియోని షేర్ చేశాడు. ఎక్కువ రోజులు ఆటలో లేనందుకు, ప్రేక్షకుల అంచనాలను తలకిందులు చేసినందుకు.. దయచేసి నన్ను అందరూ క్షమించండి. ఇకపై నేను మిమ్మల్ని సినిమాల ద్వారా... సీరియల్ ద్వారా అలరిస్తాను. ఇక సోషల్ మీడియా ఉండనే ఉంది, మీతో టచ్ లో ఉండడానికి! అంటూ అభిమానులను ఉద్దేశించి ఒక వీడియో షేర్ చేశాడు అభయ్ నవీన్. సదరు వీడియోని తిలకించిన అభయ్ అభిమానులు.. అభయ్ ని వారిస్తున్నారు. మీరు ఎలిమినేట్ అయినందుకు మాకు ఏమీ బాధ లేదన్న! మీరు సంతోషంగా ఉంటే మాకు చాలు ఎక్కడున్నా? అంటూ అభిమానులు రివర్స్లో కామెంట్ చేస్తున్నారు. అభిమానులు ఇచ్చిన రిప్లై కు అభయ్ లవ్ ఎమోజి జోడించడం మనం గమనించవచ్చు. ఇకపోతే అభయ్ నవీన్ ఎక్కడ తప్పు చేసాడో అందరికీ తెలిసిందే. అది ఒక రకంగా కాస్త హార్డ్ గా మాట్లాడుకుంటే నోటి దూల వలన అబ్బాయి ఈరోజు బయటికి వచ్చిన పరిస్థితి ఏర్పడింది అని చెప్పుకోవచ్చు. ఈ ఎలిమినేషన్ తర్వాత అయినా మిగతా కంటెస్టెంట్లు కాస్త జాగ్రత్తగా ఆడుతూ... జనాలను ఎంటర్టైన్ చేస్తే అందరికీ బాగుంటుంది! అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: