ప్లీజ్.. మా బిడ్డను అలా చూపించకండి.. బిగ్ బాస్ కంటెస్టెంట్ తల్లి రిక్వెస్ట్?

praveen
బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న బిగ్ బాస్ 8 తెలుగు షో మూడవ వారం విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. ఎన్నో అవాకులు చవాకులు మధ్య తాజాగా సిద్దిపేట్ కుర్రాడు అభయ్ నవీన్ ఎలిమినేట్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. ఇక ఆ సంగతి పక్కన పెడితే... మొత్తం బిగ్ బాస్ షో లోనే ప్రస్తుతం హౌస్ లో ఉంటున్న కంటెస్టెంట్లలో ఆకుల సోనియా ఒకరు. ఈమె మిగతా వారి కంటే చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని చెప్పుకోవచ్చు. మగ కంటెస్టెంట్లతో సోనియా చాలా చక్కగా వ్యవహరిస్తుంది. మంచి రిలేషన్ బిల్డ్ చేసుకుంటుంది. కానీ చూసేవారికి అది కాస్త తేడాగా అనిపించడంతో... సోనియా తల్లి కాస్త అసహనంగా ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి.
విషయం ఏమిటంటే? ఆకుల సోనియా తల్లిదండ్రులు అయినటువంటి మల్లీశ్వరి- చక్రపాణి ఓ మీడియా వేదికగా మాట్లాడుతూ కొన్ని అసంతృప్తిగల విషయాలను వెల్లడించారు. ముఖ్యంగా సోనియా సహ కంటెస్టెంట్స్ అయినటువంటి పృద్వి, నిఖిల్ గురించి సోనియా తల్లి చెప్పుకొచ్చింది. తన కూతురు సోనియా వారిని పెద్దోడా, చిన్నోడా అని ఎంతో సోదర భావంతో పిలుస్తోంది. ఈ విషయాలు జనాలకు ఎందుకు అర్థం కావు నాకు అర్థం కావడం లేదు? అటువంటి పవిత్రమైన బంధాన్ని శంకిస్తే పుట్టగతులు లేకుండా పోతారు ఎవరైనా? అని కాస్త గట్టిగానే హెచ్చరించింది. ఇకపోతే ఒకానొక సందర్భంలో బిగ్ బాస్ హౌస్ లో.. సోనియాని ఉద్దేశించి, మీకు ఎవరైనా బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారా? అనే ప్రశ్న వేసినప్పుడు.. స్పందిస్తూ... నాకు ఎలాంటి బాయ్ ఫ్రెండ్స్ లేరు! నాకు ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయిపోయింది. త్వరలో పెళ్లికూడా కాబోతోంది. అయితే ఈ లోపునే బిగ్ బాస్ అవకాశం రావడంతో.. మా కాబోయే శ్రీవారు నాకు ఎంకరేజ్ చేశారు! అంటూ ఆమె చెప్పుకు రావడం అందరికీ తెలిసిందే.
అయితే ఇప్పుడు ఇదే విషయమై ఆకుల సోనియా తల్లి మల్లీశ్వరి, కాస్త కంగారు పడుతున్నట్టు గుసగుసలు వినబడుతున్నాయి. సోషల్ మీడియాలో సోనియా పై వస్తున్న పుకార్లు, ఎక్కడ సోనియా వ్యక్తిగత జీవితం పై ప్రభావం చూపుతాయో అని ఆమె కంగారు పడుతున్నట్టుగా కనబడుతోంది. అయితే వాస్తవానికి, సోనియా బిగ్ బాస్ హౌస్ లో చాలా బాగా ఆడుతోంది. సందర్భంలో నిఖిల్ కూడా సోనియా పై తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చాడు. తన తల్లితో ఎలాంటి సంబంధం ఉంటుందో... సోనియాతో అలాంటి సంబంధమే ఉంది అని చాలా పాజిటివ్గా చెప్పుకొచ్చాడు. కానీ ఈ విషయాలు సోషల్ మీడియా జనాలకి ఎందుకు ఎక్కవో అర్థం కావు! అంటూ సోనియా తల్లి వాపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: