ఎలిమినేట్ అయ్యాక కూడా.. అభయ్ ను వదలని బిగ్ బాస్?

praveen
"అతి అన్నింటా వర్జనీయమే" అన్నారు పెద్దలు. అవును, అతి విశ్వాసం కూడా అంత మంచిది కాదు మరి! దానినే మోడ్రన్ జనాలు "ఓవర్ కాన్ఫిడెన్స్" అని కూడా అంటారు. ఇంతకీ విషయం ఏమిటంటే... బిగ్ బాస్ సీజన్ 8లో అభయ్ ఇలాంటి అతి విశ్వాసానికి ఉదాహరణగా మారిపోయాడు. హౌస్ లోకి ఎంటర్ అయిన కొత్తలో ప్రతీ ఒక్క ఆడియన్ అభయ్ తీరుని చూసి స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనుకున్నారు. కానీ మనోడు తోపు అనుకుంటే, నిరంతరం తన బలుపుని చూపించే ప్రయత్నం చేసేవాడు. ఇంకేముంది కట్ చేస్తే అందరికీ గిట్టనివాడు అయ్యాడు. ఇదే క్రమంలో నిఖిల్ కూడా చీఫ్ అయ్యాడు. చీఫ్స్ అయిన వీరిద్దరిలో ఎవరో ఒకరు నామినేట్ అవ్వాలని ఇద్దరినీ చర్చించుకొని నిర్ణయం తీసుకోవాలని బిగ్ బాస్ అనగా, నిఖిల్ నేను నామినేట్ అవుతానులే అనగా, అభయ్ వినకుండా ‘ఏమి అవసరం లేదు..నేను నామినేట్ అవుతా..జనాలు నన్ను సేవ్ చేస్తారనే నమ్మకం ఉంది!’ అని చెప్పి తనకి తానుగా సెల్ఫ్ నామినేట్ అయ్యాడు.
అదే తాను చేసిన పెద్ద మిస్టేక్. ఇక్కడ అభయ్ ఓవర్ కాన్ఫిడెన్సుకి పోయాడు. అయితే ఈ నమ్మకం అభయ్ కి ఊరికే రాలేదు. హౌస్లో కొంతమంది కంటెస్టెంట్స్ భజన చేయడం వల్ల వచ్చిందని మనకి చాలా స్పష్టంగా అర్ధం అయిపోతుంది. దాంతో ఆట తీరు కూడా చాలా మారిపోయింది. ప్రతీ టాస్కు ని ఆయన చాలా తేలికగా తీసుకొని ఆడేవాడు. తన టీంని గెలిపించే కసి ఎక్కడా కనిపించలేదు. దీంతో ఈయనకి ఆడియన్స్ షాక్ ఇచ్చారు. ఓట్స్ వేయడం మానేశారు. ఫలితంగా ఎలిమినేట్ అయ్యాడు.
మరో విశేషం ఏమిటంటే? అభయ్ కి బిగ్ బాస్ కూడా కౌంటర్ ఇచ్చాడు. బలుపుతో బిగ్ బాస్ ని అనరాని మాటలు అన్నాడు. కాగా బిగ్ బాస్ టీం అతను మాట్లాడిన మాటలన్నీ కట్ చేసి మరీ ఒక వీడియోగా చేసి శనివారం ఎపిసోడ్ లో టెలికాస్ట్ చేసి షాక్ ఇచ్చారు. ఆ మాటల్ని చూస్తే ఎవరికైనా కోపం వచ్చేస్తుంది. నాగార్జున కాబట్టి అతనిని గౌరవంగా హౌస్ నుండి పంపించాడు, ఇదే తరహా ప్రవర్తన తమిళ బిగ్ బాస్, హిందీ బిగ్ బాస్ లో ఉండుంటే మొహమాటం లేకుండా రెడ్ కార్డు ఇచ్చి బయటకి గెంటేస్తారు. కోట్లాది మంది వీక్షించే ఈ బిగ్గెస్ట్ రియాలిటీ షో పై అన్ని అనుచిత వ్యాఖ్యలు చేస్తే, బిగ్ బాస్ టీం పరువు నష్టం దావా వేసే అవకాశాలు కూడా లేకపోలేదు! రెమ్యూనరేషన్ కూడా ఇవ్వరు. కాగా అతను మాట్లాడిన మాటలన్నీ కట్ చేసి అలా వీడియోగా పెడతారని అభయ్ ఉహించి ఉండడు!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: