' దేవర ' కు అక్కడ ఆశలు లేవా.. ఎన్టీఆర్‌కు కూడా నమ్మకం లేదా.. !
ఈ సినిమాకు రూ.300 కోట్ల బడ్జెట్ అయినట్టు టాలీవుడ్ ట్రేడ్ వర్గాల్‌లో ప్రచారం జరుగుతోంది. దేవరపై అంచనాలు మామూలుగా లేవు .. తారాస్థాయిలో ఉన్నాయి. రెండు తెలుగు రాష్ట్రాలలో రూ.113 కోట్లకు పైగా ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందని.. కర్ణాటకలో రూ.15 కోట్లు .. తమిళనాడులో రూ.6 కోట్ల మేర బిజినెస్ జరిగిందని తెలుస్తోంది. అయితే దేవర హిందీ బిజినెస్ ఎంత జరిగింది ? అన్నదాని పై క్లారిటీ రావడం లేదు.
దేవర హిందీ థియేటర్ రైట్స్ ను ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ అనిల్ తడాని ( సీనియర్ హీరోయిన్ రవీనా టాండన్ ) భర్త రూ.15 కోట్లకు దక్కించుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. వాస్తవంగా రూ.15 కోట్లు అంటే చాలా తక్కువ అని చెప్పాలి. పుష్ప లాంటి సినిమాలు ఏకంగా అక్కడ రూ.100 కోట్లు రాబట్టాయి. ఎన్టీఆర్‌తో పాటు.. కొరటాల నార్త్ లో ప్రత్యేకంగా ప్రమోషన్లు కూడా చేశారు. అయినా హిందీలో అనుకున్న స్థాయిలో బజ్‌రాలేదు. ఇంత చేసిన ఎన్టీఆర్‌కు ... అటు మేకర్స్‌కు దేవర రిజల్ట్ విషయంలో నార్త్‌లో అంత పూర్తి నమ్మకాలు లేవన్న ప్రచారం కూడా జరుగుతోంది. మరి దేవర ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేస్తుందో చూడాలి.