కుర్ర హీరోలకు హెచ్చరిక.. ఓవర్ చేస్తే హీరో రామ్ పరిస్థితే..!
హీరో రామ్ ప్రస్తుతం ఒక చిత్రానికి రూ.25 కోట్ల రూపాయలకు పైగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారట. కానీ వరుసగా ఫ్లాప్స్ ఎదురు అవడంతో దర్శక నిర్మాతలు అంత ఇవ్వడానికి వెనుకడుగు వేస్తున్నారట.. దీంతో రామ్ కు రెమ్యూనరేషన్ బదులుగా రెండు ఏరియాలలో పంపిణీ హక్కులు తీసుకునే వీలు కల్పించే విధంగా ప్లాన్ చేయగా ఇందుకు హీరో కూడా దిగి వచ్చినట్లు తెలుస్తోంది. హీరో రామ్ నటించిన సినిమాలను తీసుకున్న బయ్యర్లకు పెద్దగా లాభాలు రాకపోవడంతో పాటుగా నష్టాలని మిగిలిస్తున్నాయట. మిస్ శెట్టి మిస్టర్ పోలి శెట్టి డైరెక్టర్ మహేష్ తో హీరో రామ్ మూవీ మైత్రి మూవీ సంస్థ తెరకెక్కించడానికి సిద్ధమయ్యిందట.
కానీ ఇక్కడే హీరో రామ్ రెమ్యూనరేషన్ విషయంపై మైత్రి మూవీ సంస్థ ఒక నిర్ణయానికి తీసుకున్నట్లు సమాచారం. హీరో రామ్ కి రెమ్యూనరేషన్ బదులుగా వైజాగ్, నైజాం ఏరియాలలో పంపిణీ హక్కులను హీరో రామ్ అడగగా మైత్రి మూవీస్ వారు నైజాం,గుంటూరు ఏరియాలలో అయితే ఓకేనని ఒప్పందం కుదుర్చుకుంటున్నట్లు సమాచారం..ఇలా అయితేనే తాము ఈ సినిమా ప్రాజెక్టుని ముందుకు తీసుకు వెళ్ళగలమని డైరెక్ట్ గా చెప్పేసారట. కుర్ర హీరోలు సరైన కథలతో సరైన సినిమా తీస్తేనే నిర్మాతలు కూడా ఖర్చు గురించి వెనుకాడడం లేదు.. కానీ వరుసగా ప్లాప్స్ అవుతూ ఉంటే కచ్చితంగా ఇలాంటి ఇబ్బందులు తప్పవని కుర్ర హీరోలకు ఇదొక హెచ్చరికని చెప్పవచ్చు. ఎహీరో అయినా సరే రెమ్యూనరేషన్ విషయంలో దిగి రాకపోతే ఇప్పుడు హీరో రామ్ పరిస్థితి ఎదురవుతుందని కూడా చెప్పవచ్చు.