ఈ యాక్టర్స్ మాంసాహారాన్ని అస్సలు ముట్టరు.. కానీ..?
* సూపర్ స్టార్ రజనీకాంత్
ఈ హీరోకి మద్యపానంతో పాటు మాంసాహారం తినే అలవాటు కూడా ఉండేది. కానీ తర్వాత ఆధ్యాత్మికత వైపు ఆయన అడుగులు వేస్తూ మాంసాహారానికి పూర్తిగా దూరం అయిపోయారు. ఇప్పుడు ప్యూర్ వెజిటేరియన్ గా కొనసాగుతున్నారు. ఒకానొక ఇంటర్వ్యూలో ఆయన తనకు ముక్క లేనిదే ముద్ద దిగేది కాదు, రోజూ రెండు పూటలా నాన్ వెజ్ ఫుడ్ తినే వాడిని అని చెప్పాడు. తర్వాత ఇది మానేయడం జరిగింది.
* ధనుష్
ధనుష్ చిన్నతనం నుంచే స్వచ్ఛమైన శాకాహారిగా ఉంటూ వస్తున్నారు. రీసెంట్‌గా హైదరాబాద్ లో జరిగిన ఒక మూవీ ఈవెంట్‌లో ధమ్ బిర్యానీ రుచి ఎలా ఉంది అని ఒకటి అడిగారు అప్పుడు తాను అస్సలు నాన్ వెజ్ తిననని, తాను ప్యూర్ వెజిటేరియన్ అని తెలిపాడు.
* మాధవన్
నటుడు మాధవన్ కూడా ప్యూర్ వెజిటేరియన్. ఈ హీరోని తన లైఫ్ లో ఒక్కసారి కూడా మాంసాహారం తినలేదట. నాన్ వెజ్ స్మెల్ చూస్తేనే అతనికి నచ్చదట. ఇక మాధవన్ కుమారుడు కూడా ప్యూర్ వెజిటేరియన్ గా పెరిగాడు.
* సూర్య
కండలు తిరిగిన సిక్స్ ప్యాక్ బాడీతో కనిపించే సూర్య కచ్చితంగా నాన్ వెజ్ తింటారని అందరూ అనుకుంటారు కానీ ఈ టాలెంటెడ్ నటుడు కూడా ప్యూర్ వెజిటేరియన్. ఈ విషయాన్ని ఆయనే ఒక సందర్భంలో వెల్లడించారు.
* కమల్ హాసన్
కమల్ హాసన్ పూర్తిగా శాకాహారి కాకపోయినా ఎక్కువగా శాఖాహారం తినడానికే ముగ్గు చూపిస్తాడట.
* త్రిష
త్రిష కి చికెన్..మటన్ అసలే తినదు. కొంత కాలం వరకు కోడిగుడ్లు తినేదట. కానీ ఇప్పుడు అది కూడా మానేసింది.
* కాజల్ అగర్వాల్
టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ కూడా చిన్నతనం నుంచి ప్యూర్ వెజిటేరియన్. శ్రియ, సమంత, తమన్నా కూడా పూర్తిగా వెజ్ ఆహార పదార్ధాలే తింటున్నారు. వీళ్లందరూ వెజిటేరియన్ ఫుడ్స్ తింటున్నా చాలా దృఢంగా, బలంగా, ఫిట్ గా ఉంటున్నారు. ఎనర్జీ లెవెల్స్ కూడా వేరే రేంజ్ లో ఉంటున్నాయి. కాబట్టి వెజ్ మాత్రమే తినేవారు కండలు పెంచలేము అని బాధపడి పోవాల్సిన అవసరం లేదు. సరైన డైట్ తో సూర్య లాగా కండలు పెంచొచ్చు.