దేవర ను టార్గెట్ చేసిన నాని.. ఆ ఆడియన్స్ మైనస్ కానున్నారా..?

MADDIBOINA AJAY KUMAR
నాచురల్ స్టార్ నాని తాజాగా సరిపోదా శనివారం అనే మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ లో ప్రియాంక అరుల్ మోహన్ నానికి జోడిగా నటించగా , ఈ సినిమాకు వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించాడు. ఎస్ జె సూర్య ఈ మూవీ లో విలన్ పాత్రలో నటించాడు. ఈ మూవీ కొంత కాలం క్రితమే మంచి అంచనాల నడుమ థియేటర్లలో విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది.

మొదటి నుండి కూడా ఈ సినిమా దేవర మూవీ ని టార్గెట్ చేస్తుంది అని ఓ వార్త వైరల్ అవుతుంది. అది ఎలా అనుకుంటున్నారా ..? యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్గా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన దేవర మొదటి భాగంను సెప్టెంబర్ 27 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ ,  హిందీ భాషలలో విడుదల చేయనున్నారు. ఇదే తేదీన నాని హీరోగా రూపొందిన సరిపోదా శనివారం మూవీ ని ఓ టీ టీ లో రిలీజ్ చేయనున్నట్లు , ఆ విధంగా నాని , ఎన్టీఆర్ హీరోగా రూపొందిన దేవర సినిమాకు పోటీగా రాబోతున్నట్లు ఓ వార్త వైరల్ అయింది.  సరిపోదా శనివారం ఓ టీ టీ విడుదలకు సంబంధించిన అధికారిక ప్రకటన తాజాగా వెలువడింది.

ఈ సినిమా సెప్టెంబర్ 27 వ తేదీన కాకుండా ఒక రోజు ముందుగా అనగా సెప్టెంబర్ 26 వ తేదీ నుండే నెట్ ఫ్లిక్స్ ఓ టి టి ఫ్లాట్ ఫామ్ లో తెలుగు , తమిళ్ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో స్ట్రీమింగ్ కాబోతుంది. దేవర కు సంబంధించిన కొన్ని ప్రీమియర్ షో స్ కూడా సెప్టెంబర్ 26 వ తేదీనే కొన్ని ప్రాంతాల్లో ప్రదర్శించబడుతున్నాయి. ఇలా నాని , జూనియర్ ఎన్టీఆర్ కు పోటీగా రాబోతున్నాడు అని జనాలు అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: