ఎర్ర సముద్రం సాక్షిగా రికార్డుల ఊచకోత.. దేవర అంటే సామి శిఖరం..!

murali krishna
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటిస్తున్న లేటెస్ట్ బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ దేవర .. టాలీవుడ్ మాస్ డైరెక్టర్ కొరటాల శివ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో బాలీవుడ్ హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది.. బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ ఈ సినిమాలో పవర్ ఫుల్ విలన్ గా నటిస్తున్నాడు.. ఈ సినిమాను మేకర్స్ సెప్టెంబర్ 27 న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.. ఈ సినిమా నుండి ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్ చార్ట్ బస్టర్ గా నిలిచాయి.. ఇంక దేవర రిలీజ్ 5 రోజులే సమయం ఉండటంతో మేకర్స్ ప్రమోషన్స్ స్పీడప్ చేసారు .. నేడు సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్ లోని నోవోటల్ లో దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతుంది.. ఈ ఈవెంట్ కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు.. ఇప్పటికే దేవర ట్రైలర్ రిలీజ్ అవ్వగా సినిమాపై అంచనాలు మరింతగా పెంచేసింది.. ట్రైలర్ లో ఎన్టీఆర్ విశ్వరూపం చూపించారు.. సినిమాలోని బిగ్గెస్ట్ యాక్షన్ సీక్వెన్స్ సినిమాకే హైలైట్ గా నిలువనున్నాయి.. 

అయితే మొదట రిలీజ్ చేసిన ట్రైలర్ లో అంత పస లేదని నెటిజన్స్ కొందరు కామెంట్స్ చేయడంతో దేవర ప్రమోషన్స్ తో ఎన్టీఆర్, కొరటాల సినిమా పై హైప్ పెంచే ప్రయత్నం చేసారు.. అలాగే నేడు దేవర నుంచి రిలీజ్ ట్రైలర్ విడుదల చేసారు.. మొదటి ట్రైలర్ లాగానే ఇందులో కూడా ఫుల్ యాక్షన్ సీక్వెన్స్ తో నింపేశారు.. ఈ ట్రైలర్ ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ తెప్పిస్తుంది. ట్రైలర్ లో దేవర ఎలివేషన్ డైలాగ్స్ సినిమాపై భారీ ఎక్సపెక్టేషన్స్ ఉండేలా చేస్తున్నాయి.. సినిమాలో ఎన్టీఆర్ తండ్రి కొడుకులుగా డ్యూయల్ రోల్ చేయడం అలాగే మరో సస్పీసియస్ పాత్ర కూడా అందులో ఉండటంతో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.. సముద్రం ఆధారంగా సాగే దేవర కథ దాదాపు ఎక్కువభాగం సీన్స్ సముద్రంలోనే సాగనున్నట్లు తెలుస్తుంది. సెప్టెంబర్ 27 న దేవర ఊచకోత చూస్తారని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: