అక్కినేని కెరియర్ లో ఆగిపోయిన ఒకే ఒక్క సినిమా.. ఎందుకంటే..!?

Anilkumar
టాలీవుడ్ లెజెండ్ అక్కినేని నాగేశ్వరరావు గారి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ ఇప్పుడు ఇలా ఉంది అంటే దానికి పిల్లర్స్ గా అక్కినేని నాగేశ్వరరావు గారు ఉన్నారు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.  అయితే అలాంటి నాగేశ్వరరావు  గారి శత జయంతి వేడుకలని అక్కినేని కుటుంబం ఘనంగా నిర్వహించింది. అన్నపూర్ణ స్టూడియోస్ లోని అక్కినేని విగ్రహానికి ఘనంగా నివాళులు అర్పించారు. ఇరు రాష్ట్రాలలోని అక్కినేని అభిమానులు అన్నపూర్ణ స్టూడియోస్ కి తరలివచ్చి అక్కినేనికి అంజలి ఘటించారు. అక్కినేని కుటుంబ సభ్యులు అభిమానులతో కలిసి భోజనాలు చేశారు. ఈ సందర్భంగా 600 వందల మంది అభిమానులకు బట్టలు బహుకరించారు.  ఇక ఈ విషయం కాసేపు పక్కన పెడితే లెజెండ్రీ యాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు

 ఆయన కెరియర్ లో ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించారు. అయితే అలా ఎన్నో సినిమాల్లో నటించిన ఆయన ఒక్క సినిమాలో మాత్రం నటించలేకపోయారు. అయితే అర్థంతరంగా ఆ సినిమా ఆగిపోయింది. మరి ఆ సినిమా ఏది ఎందుకు ఆగిపోయింది అన్న విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.. ఏఎన్ఆర్ కెరియర్లో ఆగిపోయిన ఆ సినిమా పేరు సదారమ. ఇకపోతే ఆయన కెరీర్లో ఆగిపోయిన ఒకే ఒక్క సినిమా ఇదే. ఏవీఎం స్టూడియోస్ నిర్మాణంలో ఈ సినిమా తీయడం మొదలుపెట్టారు.  ఇందులో అక్కినేని ఒక దొంగ పాత్రలో కనిపిస్తారు. అంతేకాదు ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్

 ప్రారంభించి మూడు రోజులు షూట్ చేశారు. ఆ తర్వాత ఊహించిన విధంగా ఈ సినిమా ఆగిపోయింది. అయితే నిజానికి ఈ సినిమాలో అక్కినేనికి దొంగ పాత్ర చేయడం ఇష్టం లేదు. సాధారణంగా నిజజీవితంలో దొంగగా ఉన్న ఏ మనిషికైనా కొన్ని మంచి లక్షణాలు ఉంటాయి. కానీ ఈ సినిమాలోని ఆ దొంగ పాత్రకి మాత్రం అస్సలు అలాంటివి ఉండవట. దాదాపుగా సినిమా మొత్తం నెగిటివ్ గానే ఉంటుందట అందుకే నాలుగు రోజులు షూటింగ్ మానేసి ఇంట్లోనే కూర్చున్నారట. ఆ తర్వాత నేరుగా స్టూడియోస్ కి వెళ్లి నేను ఆ పాత్ర చెయ్యను నాకు ఇష్టం లేదు అని చెప్పారట. ఇలా చేస్తే ఎలా సినిమా మధ్యలోనే ఆపేస్తే చాలా నష్టం వస్తుంది అని స్టూడియోస్ వారు చెప్పినప్పటికీ ఎంత ఖర్చైనా పర్వాలేదు నేను మొత్తం తిరిగి ఇచ్చేస్తాను అని ఆ సినిమా చెయ్యను అని మొండి కేశారట అక్కినేని. అలా ఆయన కెరియర్ లో ఈ సినిమా చేయకుండా ఆగిపోయారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: