నటసింహం నందమూరి బాలకృష్ణ తన 109వ సినిమాని బాబీ కొల్లి దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో నటసింహం నందమూరి బాలకృష్ణ పవర్ ఫుల్ మాఫీయా డాన్ రోల్ లో కనిపించనున్నాడని తెలుస్తోంది. అందుకు తగ్గట్టుగానే ఇప్పటిదాకా విడుదలైన ప్రచార చిత్రాల్లో ఆయన లుక్ ఎంతో పవర్ ఫుల్ గా ఉంది. ఇక ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ , ఫార్చూన్ ఫోర్ సినిమా బ్యానర్లపై సూర్యదేవర నాగవంశి, సాయి సౌజన్య సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. కాగా ఇందులో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ విలన్‌గా నటిస్తున్నాడు. మాస్ ఎంటర్టైనర్గా రాబోతున్న ఈ మూవీలో బాలీవుడ్ డ్యాన్సింగ్ క్వీన్ ఊర్వశి రౌటేలా ఫీ మేల్ లీడ్ రోల్లో
నటిస్తోంది. ఎన్బీకే 109లో ఊర్వశి రౌటేలా పోలీసాఫీసర్‌గా కనిపించబోతున్నట్టు సమాచారం. అయితే ఈ సినిమాతో పాటు బాలయ్య బోయపాటి శ్రీను కాంబినేషన్ లో ఒక సినిమా చేస్తున్నాడు. అయితే ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన లెజెండ్ సింహ ఆఖండ వంటి సినిమాలన్నీ కూడా వరుసగా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నాయి. దీంతో మరోసారి ఇప్పుడు వీళ్ళిద్దరి కాంబినేషన్లో నాలుగవ సినిమా రాబోతోంది. కాగా దసరా కానుకగా ఈ సినిమా ప్రారంభం కానుంది అంటూ తాజాగా సోషల్ మీడియా వేదికగా సమాచారం అందుతుంది. యాక్షన్ అండ్ డివోషనల్ కంటెంట్ తో వస్తున్న ఈ సినిమా నటసింహం నందమూరి బాలకృష్ణ కెరియర్ లోనే
అత్యంత భారీ బడ్జెట్ తో రాబోతున్నట్లుగా సమాచారం. కాగా ఈ సినిమాలో బాలయ్య సరసన ఇద్దరూ హీరోయిన్స్ నటిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇంతకు ముందు నటసింహం నందమూరి బాలకృష్ణ -బోయపాటి శ్రీను కాంబినేషన్లో తెరకెక్కిన అఖండ చిత్రానికి ఇది కొనసాగింపుగా ఉంటుందనే వార్త ప్రచారంలో వుంది. అయితే ఈ విషయాన్ని మేకర్స్ ప్రకటించలేదు. మరి దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వస్తుందా లేదా అన్నది చూడాల్సి ఉంది..!!