ప‌వ‌న్ క‌ళ్యాణ్ - రామ్‌చ‌ర‌ణ్ సినిమాలు ముద్దంటోన్న నంద‌మూరోళ్ల ఫ్యాన్స్‌...

Divya
ఈ మధ్యకాలంలో సినీ ఇండస్ట్రీకి కూడా రాజకీయ రంగు పులుముకుంది.. ఇందులో కొంతమంది సెలబ్రిటీలు కొన్ని పార్టీలకు మద్దతు పలుకుతూ ఉండగా మరి కొంతమంది సైలెంట్ గా ఉంటున్నారు. 2024 ఎన్నికలలో భాగంగా జనసేన పార్టీకి మెగా కుటుంబ సభ్యులతో పాటు కొంతమంది సీనీ సెలెబ్రెటీలు మద్దతు పలికారు. ఇక వైసిపి పార్టీకి కూడా కొంతమంది యాంకర్స్ తో పాటు ఇన్ డైరెక్ట్ గా స్టార్ సెలబ్రెటీలు కూడా సపోర్టు చేశారు. ముఖ్యంగా అల్లు అర్జున్, దిల్ రాజ్ వంటి వారు కూడా సపోర్ట్ చేశారు.

కానీ 2024 ఎన్నికలలో వైసీపీ పార్టీ చాలా ఘోరంగా ఓడిపోవడంతో కూటమిగా ఏర్పడిన జనసేన, బిజెపి, టిడిపి పార్టీల అభిమానులు కార్యకర్తలు సైతం ఇతర పార్టీకి సపోర్ట్ చేసిన హీరోల పైన దారుణమైన ట్రోల్స్ చేయడమే కాకుండ చిన్న ఇష్యూ జరిగిన కూడా ఇతర హీరోలకు లింకు పెడుతూ తిడుతూ ఉన్నారు. కూటమి  ప్రభుత్వానికి పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉన్నారు.. దీంతో చాలామంది సినీ సెలబ్రిటీలు పవన్ కళ్యాణ్ వైపుగా వెళుతున్నారు. ఎన్నికల సమయంలో కూడా చిరంజీవితో పాటు రామ్ చరణ్ నాగబాబు అతని కుటుంబ సభ్యులు కూడా సపోర్టు చేశారు.

కానీ అల్లు అర్జున్ జనసేన పార్టీకి సపోర్ట్ చేసిన తన స్నేహితుడి కోసం ప్రచారానికి వెళ్లడంతో అప్పటినుంచి అతనిపైన అటు మెగా ఫాన్స్ జనసేన కార్యకర్తలు టిడిపి నేతలు, కార్యకర్తలు కూడా ఫైర్ అవుతూ ఉన్నారు. ఎన్నికల సమయంలో జూనియర్ ఎన్టీఆర్ కూడా టిడిపి పార్టీ ప్రచారానికి రాలేదని చాలామంది పెదవివిరిచారు. అయినా కూడా వాటినీ  ఎవరు లెక్క చేయలేదు. ఇప్పుడిప్పుడే ఇవన్నీ సర్దుమునుగుతున్నాయి. అయితే కూటమి అధికారం ఏర్పడడంతో అటు చాలామంది నందమూరి హీరో అభిమానులు కూడా రామ్ చరణ్, పవన్ కళ్యాణ్ ,మెగా కుటుంబ సభ్యుల సినిమాలు చూడాలి అంటు  ఉత్సాహంతో ఉండడమే కాకుండా వీరందరికీ సపోర్ట్ చేస్తున్నారు. కానీ తెలుగుదేశం పార్టీ నందమూరి అభిమానులకు టార్గెట్ అయింది మాత్రం.. జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ మాత్రమే అనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి. మరి దీన్ని బట్టి చూస్తే మెగా కుటుంబ సభ్యుల సినిమాలంటే తమకు ముద్దంటు నందమూరి అభిమానులు తెలియజేస్తున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: