అల్లు అర్జున్ లేకపోయి ఉంటే ఆదర్శకుడి కెరియర్ అప్పుడే ముగిసిపోయేదా..?

Pulgam Srinivas
తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన నటులలో అల్లు అర్జున్ ఒకరు. ఈయన ఇప్పటివరకు ఎన్నో సినిమాలలో నటించి అందులో చాలా మూవీలతో మంచి విజయాలను అందుకున్నాడు. అల్లు అర్జున్ దర్శకులను అర్థం చేసుకోవడంలో కూడా అద్భుతమైన వ్యక్తిత్వం కలవాడు అని కూడా అనేక మంది అనేక సందర్భాలలో చెప్పారు. తాజాగా ఓ దర్శకుడు స్వయంగా అల్లు అర్జున్ వల్ల తనకు జరిగిన మేలు గురించి తెలియజేశాడు. అతని ఎవరో కాదు ఆయనే బొమ్మరిల్లు భాస్కర్. అసలేం జరిగింది అనే వివరాలను తెలుసుకుందాం.

సిద్ధార్థ్ హీరోగా జెనీలియా హీరోయిన్ గా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు బొమ్మరిల్లు అనే మూవీ ని నిర్మించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ కి భాస్కర్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాతోనే ఈయన దర్శకుడిగా కెరియర్ను ప్రారంభించాడు. ఈ సినిమాలో మొదటి సీన్ గా హీరో , హీరోయిన్ కలిసి ఐస్ క్రీమ్ తినే సన్నివేశాన్ని ప్రారంభించారట. ఈ సీన్ తీయడాన్ని భాస్కర్ దాదాపు రాత్రి 9 గంటలకు మొదలు పెట్టాడట. ఇక తొమ్మిది గంటలు కాస్త ఉదయం అయినా కూడా ఈ సీను ఆయన పూర్తి చేయలేదట. చాలా టేకులు తీసుకుంటున్నాడట. అయిన కూడా ఆ సన్నివేశాన్ని ఓకే చెప్పడం లేదట. చాలా సార్లు చేసిన తర్వాత జెనీలియా ఎందుకు ఇంత చిన్న సన్నివేశానికి ఇంత సమయం తీసుకుంటున్నారు. నేను ఈ సినిమా చేయలేను. టార్చర్ పెడుతున్నాడు అని అందంట.

ఇక అదే రోజు ఆ షూటింగ్ స్పాట్ లో అల్లు అర్జున్ కూడా ఉన్నాడట. ఆయన వచ్చి ఒక్క రోజుతో డెసిషన్ తీసుకోకు. అతనిలో మంచి టాలెంట్ ఉండి ఉంటుంది. కొంతకాలం ఆగు తెలుస్తుంది. నీకు అన్నడట. ఆ మాటతో ఆమె కూడా కన్విన్స్ అయిందట. ఇక ఆ తర్వాత షూటింగ్స్ స్పీడ్ గా కంప్లీట్ కావడం , సినిమా విడుదల కావడం ఆ మూవీ ద్వారా జెనీలియాకు మంచి గుర్తింపు రావడం దర్శకుడిగా భాస్కర్ కి కూడా మంచి గుర్తింపు రావడం జరిగింది. ఇక అల్లు అర్జున్ ఆ రోజు అలా అనకపోయి ఉండే భాస్కర్ కి తర్వాత కెరియర్ చాలా కష్టంగా ఉండేది అని పరుగులు అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: