నాని ఆకలి తీరలా.. సరిపోయేలా డిజిటల్ రికార్డులు రెడీ..?

shami
న్యాచురల్ స్టార్ నాని లేటెస్ట్ మూవీ సరిపోదా శనివారం ఆగష్టు 28న రిలీజై సెన్సేషనల్ హిట్ అందుకుంది. దసరా తర్వాత నానికి 100 కోట్ల సినిమాగా సరిపోదా శనివారం నిలిచింది. వివేక్ ఆత్రేయ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటించగా ఎస్ జే సూర్య ప్రతినాయకుడిగా నటించారు. సరిపోదా శనివారం నాని ఫ్యాన్స్ ఇంకా నాని సినిమాలను ఆదరించే ఆడియన్స్ అంతా చూశారు. కొంతమంది మిస్ అయినా వారు కూడా ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నారు.
సరిపోదా శనివారం ఈ నెల 26న ఓటీటీ రిలీజ్ అవుతుంది. నెట్ ఫ్లిక్స్ లో నాని సరిపోదా శనివారం రిలీజ్ అవుతుంది. సినిమా ఓటీటీ రైట్స్ కూడా భారీ ధరకు అమ్ముడైనట్టు తెలుస్తుంది. ఐతే థియేట్రికల్ రన్ మాత్రమే కాదు సరిపోదా శనివారం డిజిటల్ రిలీజ్ లో కూడా మరోసారి నాని సత్తా చాటాలని చూస్తున్నారు.
సినిమా ఎలాగు సూపర్ హిట్ కాబట్టి డిజిటల్ రిలీజ్ లో కూడా ఆ రిజల్ట్ రావడం గ్యారెంటీ కాకపోతే ఇక్కడ వ్యూయర్ షిప్ మీద అందరి దృష్టి ఉంది. నాని హాయ్ నాన్న సినిమా థియేట్రికల్ వెర్షన్ ఎంతమంది చూసి వావ్ అన్నారో ఓటీటీ ఆడియన్స్ కూడా నెక్స్ట్ లెవెల్ క్రేజ్ వచ్చేలా చేశారు. సో నాని ఆకలి కేవలం వెండితెర మీదే తీరినట్టు లేదు అందుకే డిజిటల్ స్ట్రీమింగ్ లో కూడా తన డామినేషన్ చూపించాలని చూస్తున్నాడు. మరి సరిపోదా శనివారం ఓటీటీ హైప్ ఎలా ఉంటుందో చూడాలి. సరిపోదా శనివారం ఓటీటీ రిలీజ్ కోసం నాని ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి ఓటీటీలో ఈ సినిమా ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి. సరిపోదా శనివారం తర్వాత నాని హిట్ 3, శ్రీకాంత్ ఓదెల సినిమాలు చేస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: