ఇక్కడ బాక్సింగ్ చేస్తున్న పాపని గుర్తు పట్టారా? సెన్సేషనల్ హీరోయిన్ ఆమె!

Suma Kallamadi
ఇక్కడ ఇవ్వబడిన ఫోటోని ఒక్కసారి సరిగ్గా గమనించండి. సరిగ్గా 12 ఏళ్లు కూడా నిండని ఓ పసిపాప బాక్సింగ్ కిట్ ని ఎలా కొడుతుందో చూడండి. ఈ దృశ్యం చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? రాబోయే రోజుల్లో కాబోయే అతిపెద్ద క్రీడాకారిణి కదూ? అని అనిపించక మానదు! ఎందుకంటే ఏదో సంపాదించాలి... మరేదో సాధించాలి.. అనే తపన ఆమె కళ్ళల్లో కొట్టొచ్చినట్టు కనబడుతుంది. అయితే ఆమె అందరూ అనుకుంటున్నట్టు క్రీడారంగంలో స్థిరపడలేదు. ఎవ్వరూ ఊహించని విధంగా ఆమె సినిమా పరిశ్రమలో స్థిరపడింది.
ఆమె మరెవ్వరో కాదు... ఉప్పెన సినిమాతో, తెలుగు కుర్ర కారు గుండెల్ని తడిపేసిన హీరోయిన్ కృతి శెట్టి. అందానికి తగ్గ అభినయం ఆమె సొంతం కావడంతో... ఈ సినిమా తర్వాత ఆమె తిరిగి వెనక్కి చూసుకోలేదు. వరుస సినిమా ఆఫర్లను దక్కించుకుంటూ టాలీవుడ్లో దూసుకుపోతోంది. అయితే పై ఫోటోలోని ఫోజు చూస్తుంటే మొదట మీకు, ఆమె చిన్నప్పుడు బాక్సింగ్ ప్రాక్టీస్ చేసిందని అనుకున్నారు కదూ! కానీ అది వాస్తవం కాదు!
వాస్తవం ఏమిటంటే? ఆమె చిన్ననాటి నుండే పలు యాడ్స్ లో నటించేది. లైఫ్ బాయ్, డైరీ మిల్క్ చాక్లెట్ వంటి టాప్ బ్రాండ్ల యాడ్స్ లో నటించింది. పై ఫొటో లైఫ్ బాయ్ యాడ్‌కు సంబంధించినదే... దానికి సంబంధించిన ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, కృతి శెట్టి బాల్యానికి సంబంధించిన అంశాలను సోషల్ మీడియా ప్రేక్షకులు తెగ వెతికేస్తున్నారు. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. డేవిడ్ ధావన్ దర్శకత్వంలో వరుణ్ ధావన్ హీరోగా నటిస్తోన్న సినిమాలో కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుందని విశ్వసనీయ వర్గాల సమాచారం. అదే విధంగా హీరోయిన్ కృతి రెండోసారి తనకి కలిసొచ్చిన మెగా హీరో వైష్ణవ్ తేజ్ సరసన నటిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: