జానీ మాస్టర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. జానీ మాస్టర్ ను గోవాలో అరెస్టు చేసిన పోలీసులు హైదరాబాద్ కు తీసుకొచ్చారు. ఆ తర్వాత రహస్య ప్రదేశంలో ఉంచి అతని దగ్గర నుంచి వివరాలు రాబట్టారు. ఈక్రమంలో జానీ మాస్టర్ కోర్టులో హజరుపచ్చారు. అయితే.. కోర్టు రిమాండ్ రిపొర్టులో జానీ మాస్టర్ సంచలన నిజాలు బైటపెట్టారు. జూనియర్ కొరియోగ్రాఫర్ కేసులో.. జానీ మాస్టర్ నేరాన్ని అంగీకరిచినట్లు కూడా పోలీసులు రిమాండ్ రిపోర్టులో వెల్లడించారు.కేవలం ఉద్దేష్యపూర్వకంగా.. 2017 లో ఒక ప్రొగ్రామ్ లో పరిచయమైన యువతిని.. తన టీమ్ లోకి జాయిన్ చేసుకున్నారు. ఆ తర్వాత ఆమెను
అసిస్టెంట్‌గా చేర్చుకున్నాడని పోలీసులు తేల్చారు. అదే విధంగా.. 2020లో ముంబయిలోని ఒక హోటల్‌లో తన అసిస్టెంట్‌పై జానీ లైంగిక దాడికి పాల్పడినట్లు కూడా తెలిపారు. లైంగిక దాడి జరిగినప్పుడు బాధితురాలి వయసు 16 ఏళ్లుగా పోలీసులు తెల్చారు.. నాలుగేళ్లుగా బాధితురాలిపై పలుమార్లు జానీ లైంగిక దాడికి.. జానీ మాస్టర్ పడుతునే ఉన్నాడని కూడా.. రిమాండ్ రిపోర్ట్‌లో పోలీసులు పేర్కొన్నారు. అయితే తాజాగా విస్తూపోయే నిజాలు బయటకు వచ్చాయి.. ఈ కేసు పెట్టడానికి మరో కారణం ఉందని పోలీసుల విచారణలో వెళ్లడయింది.. బాధితురాలు మాస్టర్ తో కలిసి డ్యాన్స్ షోలు, సినిమాలు చేసేది. ఓరోజు మాస్టర్
ను కాదని కొన్ని ఆఫర్స్ డైరెక్ట్ గా ఈమె వద్దకు రావడం జానీ మాస్టర్ సహించలేక పోయాడు. బాధితురాలికి అవకాశం ఇవ్వడం ఈ గొడవకు బీజం పడినట్టు సమాచారం. తనకు ఇచ్చిన ఆఫర్‌ను ఆమెకు ఎలా ఇస్తారనే విషయంపై ఆ సినిమా డైరెక్టర్‌తో గొడవ పడ్డారనేది చర్చ ఇండస్ట్రీ వర్గాల్లో జరుగుతున్నది.. స్టార్ హీరో సినిమాల్లో అవకాశాలు వస్తే నువ్వు ఎలా తీసుకుంటావని గొడవలు జరిగాయట. మాస్టర్ భార్య భాధితురాలి పై గొడవకు దిగిందని టాక్. ఆ గొడవల తర్వాతే జానీ మాస్టర్‌పై కేసు పెట్టాలని ప్రోత్సాహించారు. అలా ఆ కేసు ఇప్పటికి బయట పడింది...!!