తొలి ఇండియన్ సినిమాగా రికార్డ్.. ఊహించని బడ్జెట్ తో స్పిరిట్..!?

Anilkumar
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి సినిమా తో ప్రపంచవ్యాప్తంగా  తన రేంజ్ పెంచుకున్నాడు.ఈ  సినిమాలో ప్రభాస్ నటనకు విమర్శకులు ప్రశంసలు కురిపించారు.కానీ ఆ తర్వాత ప్రభాస్ నటించిన సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ సినిమా లు మాత్రం అభిమానులను తీవ్రంగా నిరాశపరిచాయి. అయితే ఆ తర్వాత వచ్చిన సలార్, కల్కీ 2898AD చిత్రాలు హిట్ అయ్యి కలిసి వచ్చాయి. ఈ రెండు సినిమాలు భారీ కలెక్షన్స్ తో నిర్మాతలకు ఆనందాన్ని కలిగించాయి.  ప్రస్తుతం ప్రభాస్‌ వరుస సినిమాలతో ముందుకు వెళ్తున్నారు. మారుతీ దర్శకత్వంలో ‘ది రాజా సాబ్’  శరవేగంగా  షూటింగ్  జరుపుకొంటోంది. హారర్‌, థ్రిల్లర్‌ గా

 ఈ సినిమాని  తీర్చిదిద్దుతున్నారు. హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ పీరియాడిక్‌ యాక్షన్ డ్రామాలో నటిస్తున్నారు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్  . ఇందులో ప్రభాస్‌ సైనికుడిగా కనిపించనున్నారు. 1940 దశకంలో జరిగే కథ అని కాన్సెప్ట్‌ పోస్టర్‌ చూస్తే అర్థమవుతోంది. ఇమాన్వీ ఎస్మాయిల్‌ హీరోయిన్.  ఇటీవల షూటింగ్ మొదలైంది. దీంతో పాటు ‘కల్కి2’, ‘సలార్2’ చేయాల్సి ఉంది. మంచు విష్ణు  ‘కన్నప్ప’లోనూ అతిథి పాత్రలో ప్రభాస్‌ మెరవనున్నారు. మరోవైపు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్     డాషింగ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్న స్పిరిట్ అనే చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. ఈ చిత్రంలో ప్రభాస్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడు. కాగా ఈ చిత్రాన్ని

 ప్యాన్ ఇండియా లెవల్ లో విడుదల చేసేందుకు సందీప్ రెడ్డి సన్నాహాలు చేస్తున్నాడు. అయితే యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్  స్పిరిట్ సినిమా కోసం నిర్మాతలు దాదాపుగా రూ.500 కోట్లు బడ్జెట్ వెచ్చిస్తున్నారు. దీంతో అత్యంత ఎక్కువ బడ్జెట్ తో తెరకెక్కించిన ఇండియన్ చిత్రాలలో స్పిరిట్ మొదటి స్థానంలో నిలుస్తోంది. అయితే మొన్నటివరకూ కల్కి చిత్ర సక్సస్ ని ఎంజాయ్ చేసిన ప్రభాస్ ప్రస్తుతం స్పిరిట్ చిత్ర షూటింగ్ కోసం రెడీ అవుతున్నాడు...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: