ప్రముఖ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్‌ను సైబరాబాద్ ఎస్ ఓటీ పోలీసులు అరెస్టు చేశారు. గత రెండు రోజులుగా జానీ కోసం పోలీసులు గాలిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన లడఖ్ లో ఉన్నారంటూ ప్రచారం జరిగింది. మరికొందరు ఆయన చెన్నైకి వెళ్లిపోయారని కూడా చెబుతూ వచ్చారు. అయితే.. బెంగళూరులో ఉన్నట్టు సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు వెళ్లి అరెస్టు చేశారు. ప్రస్తుతం బెంగళూరు నుంచిప్రముఖ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ ని హైదరాబాద్‌కు తీసుకురానున్నారు. ఈ క్రమంలో రాయదుర్గం పోలీసులు.. మంగళవారం సాయంత్రమే కేసు నమోదు చేశారు. అనంతరం.. దీనిని నార్సింగి పోలీసులకు బదిలీ
చేశారు. ఈ కేసులో ప్రధానంగా పోక్స్ తదితర కీలక చట్టాలను ప్రయోగించారు. మరోవైపు.. జనసేన పార్టీనాయకుడిగా ఉన్న ప్రముఖ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ ని ఆ పార్టీ దూరంపెట్టింది. అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనరాదంటూ.. స్పష్టం చేసింది. ఇప్పుడు ఏకంగా జానీని పోలీసులు అరెస్టు చేశారు. ఇక ప్రస్తుతం ప్రముఖ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ సైబరాబాద్ SOT పోలీసుల అదుపులో ఉన్నాడని తెలుస్తోంది. ఇప్పటికే పలుమార్లు బాధితురాలని విచారించిన పోలీసులు… పలు సెక్షన్ల కింద నాన్-బెయిలబుల్ కేసులు నమోదు చేశారు. మైనర్‌గా ఉన్నప్పుడే తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని బాధితురాలు ఫిర్యాదు చేయడంతో పోక్సో యాక్ట్‌ను ఎఫ్‌ఐఆర్‌లో యాడ్ చేశారు.
ఇక ప్రముఖ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ ర్‌పై నాన్ బెయిలబుల్ కేసు నమోదు కావడంతో ఆయన్ను అరెస్టు చేశారు పోలీసులు. మరోవైపు జానీ మాస్టర్ భార్య ఆయేషా ఇచ్చిన సమాచారంతోనే జానీమాస్టర్ అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. ఆమె నార్సింగి పీఎస్‌కు వచ్చారు. తనకు ఫేక్ కాల్స్ వస్తున్నాయని పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదే సమయంలో అక్కడున్న మీడియా ప్రతినిధులతోనూ వాగ్వాదం పెట్టుకున్నట్టారు. తనపై కెమెరా పెడితే కేసులు పెడతానంటూ చిర్రుబుర్రులాడారు...!!