జానీ మాస్టర్ ఇప్పుడు పోలీసుల అదుపులో ఉన్నాడు. జానీ మాస్టర్ మీద పోక్సో చట్టం కింద కేసు నమోదైన సంగతి తెలిసిందే. పరారిలో ఉన్న జానీ మాస్టర్‌ను గోవాలో స్పెషల్ టీం అదుపులోకి తీసుకుంది. గురువారం నాడు హైద్రాబాద్‌కు జానీ మాస్టర్‌ను తరలించారు. ఇప్పుడు నార్సింగి పోలీసుల అదుపులో జానీ మాస్టర్ ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక త్వరలోనే జానీ మాస్టర్‌ను న్యాయస్థానం ముందుకి తీసుకు రానున్నారు. ఇకపోతే జానీ మాస్టర్ మీద గత నాలుగైదు రోజులుగా సోషల్ మీడియాలో వినిపిస్తున్న విమర్శలు అందరికీ తెలిసిందే. కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ గత కొంతకాలంగా తన మీద లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్లు లేడీ
కొరియోగ్రాఫర్ (21) పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. జానీ మాస్టర్ లైంగికంగా వేధిస్తున్నారంటూ రాయదుర్గం పోలీస్‌స్టేషన్‌లో కేసు పెట్టింది. తనపై అత్యాచారం చేయడంతోపాటు గాయపరిచాడని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. దీంతో ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా జనసేన పార్టీ సభ్యుడిగా జానీ మాస్టర్ ఉన్నారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆ పార్టీ తరపున ప్రచారం నిర్వహించారు. జానీ మాస్టర్ పై లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో జనసేన పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని ఆదేశాలు జారీ అయ్యాయి. జానీమాస్టర్‌పై ఫిర్యాదులో సంచలన ఆరోపణలు చేశారు
బాధితురాలు. జానీ మాస్టర్‌కు వత్తాసు పలికేలా ఆయన భార్య అయేషా తనపై దాడి చేసి పలుమార్లు కొట్టారంటూ.. ముంబై సహా వివిధ నగరాల్లో అవుట్‌డోర్‌లో ఉన్నప్పుడు జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించారని కంప్లైంట్ చేశారు. ప్రతిఘటిస్తే కొట్టి, హింసించే వారని.. మతం మార్చుకుని పెళ్లిచేసుకోవాలని ఒత్తిడి చేశారన్నారు. లేకపోతే ఇండస్ట్రీలో లేకుండా చేస్తానని బెదిరించారంటూ ఆవేదన వెళ్లగక్కారు. షూటింగ్ వానిటీ వ్యాన్‌లో ఎన్నొసార్లు లైంగికంగా వేధించారన్నారు బాధితురాలు. అందరిముందే అసభ్యంగా టచ్ చేసేవారని.. ఓసారి ఇంటికి వచ్చి జానీ మాస్టర్, ఆయన భార్య అయేషా బెదిరించారని.. భార్య అయితే.. పలుమార్లు కొట్టారంటూ ఆరోపించారు...!!