పునీత్ రాజ్ కుమార్ ని స్టార్ హీరోగా చేసింది మన తెలుగు దర్శకులే.. వారెవరో తెలుసా..?

Pulgam Srinivas
దివంగత కన్నడ సినీ నటుడు పునీత్ రాజ్ కుమార్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈయన ఎన్నో బ్లాక్ బాస్టర్ విజయాలను అందుకుని కన్నడ సినీ పరిశ్రమలో చాలా తక్కువ కాలంలోనే స్టార్ హీరో స్థాయికి ఎదిగాడు. అలా ఎదగడం మాత్రమే కాదు స్టార్ హీరో స్థాయి వచ్చిన తర్వాత ఎంతోమందికి ఎన్నో సహాయాలను చేస్తూ గొప్ప వ్యక్తిగా పేరును సంపాదించుకున్నాడు. ఇంత గొప్పగా పేరును సంపాదించుకున్న ఈయన కన్నడ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా ఎదగడానికి మన తెలుగు దర్శకులే ప్రధాన కారణం అనే విషయం మీకు తెలుసా. ఆ దర్శకులు ఎవరు... ఎలా కారణం అయ్యారు అనే వివరాలను తెలుసుకుందాం.

కన్నడ దివంగత నటుడు పునీత్ రాజ్ కుమార్ "అప్పు" అనే సినిమాతో వెండి తెరకు పరిచయం అయ్యాడు. ఈ సినిమాకు టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాను తెలుగులో ఇడియట్ అనే పేరుతో రీమిక్ చేశారు. ఇక అప్పు మూవీ బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది. ఈ సినిమాతోనే పునీత్ రాజ్ కుమార్ కు కన్నడ సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు లభించింది. ఈ సినిమా ఏకంగా 200 రోజులు పాటు థియేటర్లలో ఆడింది. ఆ సమయంలోనే 11 కోట్ల వరకు నిర్మాతలకు లాభం తెచ్చి పెట్టినట్లు తెలుస్తుంది. ఇక పునీత్ రాజ్ కుమార్ తన మూడవ సినిమాగా వీర కన్నడిగా అనే మూవీలో హీరోగా నటించాడు. ఈ మూవీకి టాలీవుడ్ ఇండస్ట్రీలో అనేక సినిమాలకు దర్శకత్వం వహించి ఒక్క విజయాన్ని కూడా అందుకోలేక పోయిన మెహర్ రమేష్ దర్శకత్వం వహించాడు.

ఈ మూవీ మాత్రం కన్నడ సినీ పరిశ్రమలో బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది. ఈ సినిమా జూనియర్ ఎన్టీఆర్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఆంధ్రావాలా అనే పేరుతో రీమేక్ అయ్యింది. ఈ మూవీ 100 రోజులపాటు దియేటర్లలో ఆడింది. ఇలా పునీత్ రాజ్ కుమార్ కెరియర్ బిగినింగ్ లో పూరి జగన్నాథ్ , మేహర్ రమేష్ ఈయనకు బ్లాక్ బాస్టర్ విజయాలను అందించారు. అలా ఈ ఇద్దరు తెలుగు దర్శకులు వల్ల ఈయన కన్నడ ఇండస్ట్రీలో స్టార్ హీరో అయ్యాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Prk

సంబంధిత వార్తలు: