రెబల్ స్టార్ ప్రభాస్ , ఎస్ ఎస్ రాజమౌళి కాంబినేషన్లో ఇప్పటివరకు చాలానే మూవీలు వచ్చాయి. మొదటగా వీరిద్దరి కాంబోలో చత్రపతి మూవీ వచ్చి బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ సినిమా తర్వాత బాహుబలి 1 , బాహుబలి 2 అనే సినిమాలు వచ్చాయి. ఈ రెండు మూవీలు కూడా అద్భుతమైన విజయాలను అందుకున్నాయి. రాజమౌళి సినిమాల వల్ల ప్రపంచవ్యాప్తంగా గుర్తింపును తెచ్చుకున్న ప్రభాస్ కి రాజమౌళి ఇచ్చిన ఒక సలహా వల్ల ఇబ్బందులు కూడా వచ్చాయట. అవేంటో ప్రభాస్ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.
ప్రభాస్ ఒకానొక ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడుతూ ... నేను కొంత కాలం క్రితం మిస్టర్ పర్ఫెక్ట్ అనే సినిమాలో హీరోగా నటించాను. ఆ సినిమాలో ఓ సీన్ ఉంటుంది. ఆ సీన్ లో నాతో పాటు గ్రేట్ డైరెక్టర్ విశ్వనాథ్ కూడా ఉంటారు. ఆ సీన్ చేస్తున్నప్పుడు నేను డైలాగ్ గట్టిగా చెప్పడం లేదు. మెల్లిగా చెప్తున్నాను. అది గమనించిన విశ్వనాథ్ ఆ సిన్ మొత్తం అయిపోయాక ఇంతా గొప్ప హీరోవి , నీకు ఎంతో పాపులారిటీ ఉంది. నువ్వు ఎందుకు డైలాగ్ గట్టిగా చెప్పలేకపోతున్నావు. దానివల్ల నీకు సమస్య వస్తుంది. దర్శకులకు కూడా సమస్య వస్తుంది. నువ్వు ఇకపై నుండి డైలాగులు గట్టిగా , గంభీరంగా చెప్పడం అలవాటు చేసుకో అని అన్నాడు. ఆయన అలా చెప్పిన తర్వాత నిజమే కదా ... ఇలా చెప్పద్దు అని నేను అనుకున్నాను అని ప్రభాస్ చెప్పాడు.
అలాగే అసలు ఇలాంటి అలవాటు రావడానికి ప్రధాన కారణం రాజమౌళి. రాజమౌళి దర్శకత్వంలో చత్రపతి సినిమా చేస్తున్నప్పుడు అక్కడ ఇంటర్వెల్ ముందు ఒక పెద్ద సన్నివేశం ఉంటుంది. అక్కడ చాలా మంది జనాలు ఉంటారు. అంత మంది ముందు నేను గట్టిగా డైలాగ్ చెప్పాలి కానీ అది నా వల్ల కాలేదు. దానితో రాజమౌళి వచ్చి నువ్వు ఏదో ఒకటి మెల్లగా చెప్పు. నేను డబ్బింగ్లో అడ్జస్ట్ చేసుకుంటాను అన్నాడు. ఇక నేను అలాగే చెప్పాను. అది సూపర్ సక్సెస్ అయింది. దానితో నేను దానికి అలవాటు పడిపోయాను అని ప్రభాస్ చెప్పుకొచ్చాడు.