దేవర టార్గెట్ మరి అంత తక్కువ.. నిర్మాతలు రిస్క్ తీసుకోవడం లేదా..?

Pulgam Srinivas
జూనియర్ ఎన్టీఆర్ , రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఆర్ ఆర్ ఆర్ మూవీ తో ఇండియా స్థాయిలో క్రేజ్ వచ్చింది. దానితో ఆయన తాజాగా దేవర అనే భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీలో హీరోగా నటించాడు. ఈ సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహించగా , జాన్వి కపూర్ ఈ మూవీ లో హీరోయిన్గా నటించింది. బాలీవుడ్ నటుడు. సైఫ్ ఆలీ ఖాన్ ఈ మూవీ లో ప్రధాన పాత్ర నాయకుడి పాత్రలో నటించగా , ప్రస్తుతం ఇండియాలో అత్యంత క్రేజ్ కలిగిన సంగీత దర్శకులలో ఒకరిగా కెరియర్ను కొనసాగిస్తున్న అనిరుద్ రవిచంద్రన్ ఈ మూవీ కి సంగీతం అందించాడు. ఈ మూవీ ని సెప్టెంబర్ 27 వ తేదీన విడుదల చేయనున్నారు.

దానితో ఈ మూవీ బృందం వారు ప్రస్తుతం ప్రచారాలను జోరుగా ముందుకు సాగిస్తున్నారు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ కి భారీ ఎత్తున ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరుగుతుంది. ఈ మూవీ కి పెద్ద టార్గెట్ ఉంటుంది అని చాలా మంది అనుకుంటూ వచ్చారు. కానీ ఈ మూవీ నిర్మాతలు మాత్రం ఈ సినిమాను తక్కువ ధరకే అమ్మివేసినట్లు తెలుస్తోంది. ఈ మూవీ కి బ్రేక్ ఈవెన్ టార్గెట్ కూడా చాలా తక్కువే ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ కి నైజాం ఏరియాలో 45 కోట్ల మేర ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. విశాఖలో 12 కోట్ల 50 లక్షలు , ఈస్ట్ లో 8 కోట్లు , వెస్టులో 6 కోట్లు , కృష్ణ లో 7 కోట్లు , గుంటూరులో 8 కోట్ల 50 లక్షలు , నెల్లూరులో 4 కోట్లు , సీడెడ్ లో 22 కోట్లు. మొత్తంగా ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 113 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది.

ఇక కర్ణాటక ఏరియాలో 15 కోట్లు , తమిళనాడులో 6 కోట్లు , కేరళలో 50 లక్షలు , హిందీ బెల్ట్ లో 15 కోట్లు , ఓవర్సీస్ లో 26 కోట్లు. ఇలా మొత్తంగా ఈ సినిమాకు 180 కోట్ల వరకు ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. హిట్ టాక్ వస్తే ఈ టార్గెట్ పెద్ద విషయం ఏమీ కాదు. హిట్ టాక్ వస్తే ఈజీగా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బ్రేక్ ఈవెన్ ఫార్ములాను కంప్లీట్ చేసుకుని భారీ లాభాలను అందుకునే అవకాశం చాలా వరకు ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: