యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తన కెరియర్ లో చాలా సినిమాలను వదులుకున్నాడు. కానీ ఒక సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది అని తెలిసిన కూడా ఒక కారణం వల్ల దానిని వదిలేశాడు. ఆ విషయాన్ని జూనియర్ ఎన్టీఆర్ ఒక ఇంటర్వ్యూలో తెలియజేశాడు. ఆ సినిమా ఏది ..? ఎందుకు వదిలేశాడు అనే విషయాలను తెలుసుకుందాం. జూనియర్ ఎన్టీఆర్ కొంత కాలం క్రితం ఓ ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడుతూ ... బొమ్మరిల్లు సినిమా కథను ఆ మూవీ దర్శకుడు భాస్కర్ మొదట నాకు వినిపించాడు. సినిమా కథ మొత్తం విన్న తర్వాత అద్భుతంగా అనిపించింది. సినిమా మంచి విజయం సాధిస్తుంది అని కూడా అనిపించింది.
కాకపోతే ఆ సినిమా నాపై అస్సలు వర్కౌట్ కాదు అని నాకు అనిపించింది. ఎందుకు అంటే నా అభిమానులు నా సినిమాల్లో , ఫైట్లు , డైలాగులు ఎక్స్పెక్ట్ చేస్తారు. అవి ఆ సినిమాలో లేవు. అలాంటి సన్నివేశాలు ఊహించుకొని సినిమా థియేటర్ కి వచ్చిన వారికి అలాంటి సీన్స్ లేకపోయేసరికి వారు డిసప్పాయింట్ అవుతారు. దానితో ఆ సినిమా ప్లాప్ అయ్యే అవకాశాలు ఉంటాయి. నా ఈమేజ్ వల్ల అంత గొప్ప కథ పాడు కాకూడదు అనే ఉద్దేశంతో ఆ సినిమా కథను రిజెక్ట్ చేశాను అని జూనియర్ ఎన్టీఆర్ ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.
ఇకపోతే బొమ్మరిల్లు సినిమాలో సిద్ధార్థ్ హీరోగా నటించగా ... జెనీలియా హీరోయిన్ గా నటించింది. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను దిల్ రాజు నిర్మించాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. కోట శ్రీనివాసరావు , తనికెళ్ల భరణి , ప్రకాష్ రాజ్ ముఖ్య పాత్రలలో నటించిన ఈ మూవీ కి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు.