యూఎస్ఏ లో దేవర కి సరికొత్త రికార్డు కాయం.. హిట్ టాక్ వస్తే స్టార్ హీరోల రికార్డులకు గండి..?

Pulgam Srinivas
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ సోలో హీరోగా నటించిన సినిమా విడుదల అయ్యి ఇప్పటికి చాలా కాలం అవుతుంది. ఈయన ఆఖరుగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఆర్ ఆర్ ఆర్ అనే భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. కానీ ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ తో పాటు రామ్ చరణ్ కూడా హీరోగా నటించాడు. జూనియర్ ఎన్టీఆర్ ఆఖరుగా సోలో హీరోగా నటించిన సినిమా అరవింద సమేత. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఇకపోతే అరవింద సమేత సినిమా తర్వాత జూనియర్ ఎన్టీఆర్ సోలో హీరోగా నటించిన దేవర సినిమా సెప్టెంబర్ 27 వ తేదీన విడుదల కానుంది.
 

ఈ సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహించగా ... జాన్వి కపూర్ ఈ మూవీ లో హీరోయిన్గా నటించింది. ఈ సినిమాను సెప్టెంబర్ 27 వ తేదీన విడుదల చేయనుండగా సెప్టెంబర్ 26 వ తేదీనే ఈ సినిమాకు సంబంధించిన ప్రీమియర్ షో లను "యు ఎస్ ఏ" లో ప్రదర్శించబోతున్నారు. అందుకు సంబంధించిన టికెట్ బుకింగ్లను కూడా ఈ మూవీ బృందం వారు చాలా రోజుల క్రితమే విడుదల చేశారు. "యూ ఎస్ ఏ" లో దేవర సినిమా ప్రీమియర్ ఫ్రీ సేల్స్ కి జనాల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభిస్తుంది.

దానితో ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించిన ప్రీమియర్ షో లకి సంబంధించిన 50000 ప్లస్ టిక్కెట్లు అమ్ముడుపోయినట్లు ఈ మూవీ బృందం అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ను కూడా విడుదల చేసింది. ప్రస్తుతం "యు ఎస్ ఎ" ప్రేక్షకుల నుండి దేవర మూవీ కి మంచి రెస్పాన్స్ లభిస్తుంది. ఈ సినిమాకు హిట్ టాక్ వచ్చినట్లు అయితే "యు ఎస్ ఏ" ఏరియా నుండి ఈ సినిమాకు భారీ మొత్తంలో కలక్షన్లు వచ్చే అవకాశం చాలా వరకు ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: