ఖైరతాబాద్ గణేషుడు గంగమ్మ ఒడికి చేరాడు. ఖైరతాబాద్ బాద్ నుంచి నిన్న ఉదయం 7 గంటలకు ప్రారంభమైన సప్తముఖ మహాగణపతి శోభాయాత్ర ప్రారంభమైంది. టెలిఫోన్ భవన్, సెక్రటేరియట్, ఎన్టీఆర్ మార్గ్ మీదుగా ట్యాంక్‌బండ్ చేరుకున్నాడు. అనంతరం వెల్డింగ్ పనులు పూర్తయిన తర్వాత.. మహాగణపతికి నిర్వాహకులు ప్రత్యేక పూజలు చేశారు. నాలుగో నంబర్ క్రేన్ వద్ద లంబోధరుడిని నిమజ్జనం చేశారు. మహాగణపతి నిమజ్జనాన్ని తిలకించేందుకు భారీగా భక్తులు తరలివచ్చారు. దీంతో ట్యాంక్‌బండ్ జనసంద్రంగా మారిపోయింది. గతపతి బప్పా మోరియా నినాదాలతో హుస్సేన్‌సాగర్ పరిసరాలు
మారుమ్రోగాయి. భాగ్యనగరమే కాదు దేశవ్యాప్తంగా ఖైరతాబాద్ గణేషుడికి ప్రత్యేకమైన గుర్తింపు ఉన్నది. ఉత్సవాలను ప్రారంభించి 70 ఏండ్లు పూర్తయిన సందర్భంగా ఈసారి రికార్డు స్థాయిలో 70 అడుగుల ఎత్తయిన విగ్రహాన్ని ప్రతిష్టించారు. శిల్పి చిన్న స్వామి రాజేందర్ ఆధ్వర్యంలో లంబోధరుడుని రూపొందించారు. ఇదిలా ఉంటే కమల్ హాసన్ ఖైరతాబాద్ గణేష్ ముందు డాన్స్ చేసిన విషయం మీకు తెలుసా.? అవును ఖైరతాబాద్ గణేష్ ముందు కమల్ హాసన్ అద్భుతమైన డాన్స్ చేశారు. ఓ కోసం కమల్ ఖైరతాబాద్ వినాయకుడి విగ్రహం ముందు డాన్స్ చేశారు. ఆ సినిమా నే సాగరసంగమం. కళాతపస్వి కె
విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం భారీ హిట్ గా నిలిచింది. ఈ సినిమా లో కమల్ ఓ క్లాసిక్ డాన్సర్ గా నటించారు. ఒక సన్నివేశంలో కమల్ హాసన్ వినాయకుడి విగ్రహం ముందు డాన్స్ చేస్తూ కనిపిస్తారు. ఆ వినాయకుడు మన ఖైరతాబాద్ గణేషుడే.. 1983లో ఖైరతాబాద్ విగ్రహం ముందు సాగరసంగమం కోసం కమల్ డాన్స్ చేశారు. అయితే సాగర సంగమం ఆ ఏడాది వినాయక చవితి కంటే ముందే రిలీజ్ అయ్యింది. అలా ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..60 ఏళ్లకు పైగా అనుభవం ఉన్న నటుడు కమల్ హాసన్ ఇటీవల “భారతీయుడు 2” – “కల్కి 2898 AD” చిత్రాలలో కనిపించారు. అందులో కల్కి సినిమాలో ఆయన చేసిన పాత్ర చిన్నది ఆయన కనిపించిన కొద్దిసేపే భలే ఉన్నాడే ఎంతైనా కమలహాసన్ కదా అనేలా నటించాడు. అయితే ఆయన ప్రధాన పాత్రలో చేసిన భారతీయుడు 2 సినిమా మాత్రం దారుణ డిజాస్టర్ గా మారింది.!!