దేవర టీమ్ ఎందుకు ఇలా చేస్తుంది.. ఎక్కడో తేడా కొడుతుందే?

praveen
కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న దేవర మూవీ విడుదలకు సిద్ధమవుతుంది అన్న విషయం తెలిసిందే. 300 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాపై ఏ రేంజ్ లో అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్టీఆర్ నటించిన త్రిబుల్ ఆర్ లాంటి వరల్డ్ వైడ్ హీట్ తర్వాత వస్తున్న మూవీ కావడంతో ప్రపంచవ్యాప్తంగా కూడా సినీ ప్రేక్షకులు అందరూ ఈ సినిమా కోసం వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు.

 అయితే ఈ సినిమా అటు ఈనెల 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది అన్న విషయం తెలిసిందే. కాగా ప్రస్తుతం చిత్ర బృందం ప్రమోషన్స్ లో బిజీ బిజీగా ఉంది. అయితే ఈ సినిమాల్లో తారక్ సరసన జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తూ ఉండగా.. సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు. అయితే విడుదలకు కేవలం ఇంకా కొన్ని రోజులు మాత్రమే ఉండడంతో ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచింది చిత్రబృందం. అయితే తెలుగులో కాకుండా వేరే భాషల్లో ఎక్కువ ప్రమోషన్స్ చేయడంపై ప్రస్తుతం అనేక అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇప్పటివరకు తెలుగులో చేసిన ప్రమోషన్స్ తో పోల్చి చూస్తే ఇతర భాషల్లో చేసిన ప్రమోషన్స్ ఎక్కువ.

 ఇప్పటికే హిందీ ప్రమోషన్స్ కి కాస్త ఎక్కువ సమయాన్ని కేటాయించారు మేకర్స్. ఇక ఇప్పుడు తమిళ వర్షన్ కి ఏకంగా రెండు రోజులపాటు టైం కేటాయించారు. దీంతో తెలుగుతో పోల్చి చూస్తే ఇతర భాషల ప్రమోషన్స్ పైన ఎక్కువగా దృష్టి పెట్టారు. దీంతో దేవర మూవీపై ఎన్నో రూమర్స్ వైరల్ గా మారిపోయాయి. కంటెంట్ లో పసలేదా. అందుకే ఇంత గట్టిగా ప్రమోషన్స్ చేస్తున్నారా.. ప్రమోషన్స్ చేస్తే గట్టిగా ఓపెనింగ్స్ వస్తాయని అనుకుంటున్నారా అంటూ ఎంతోమంది కామెంట్లు చేస్తున్నారు. ప్రభాస్ నటించిన సలార్ ఆదిపురుష్ లాంటి సినిమాలకు ఇలా అన్ని భాషల్లో ప్రమోషన్స్ చేయలేదు. డైరెక్ట్ గానే రిలీజ్ చేశారు. కానీ దేవరకు ఎందుకు ప్రమోషన్స్ కోసం ఇంతలా కష్టపడుతున్నారు అంటూ అందరూ మాట్లాడుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: