ఆ ఒక్క సీన్ కోసం.. ఎన్టీఆర్ మూడేళ్లు కోర్టు చుట్టూ తిరిగారట తెలుసా?
కృష్ణుడిగా రాముడిగా కర్ణుడిగా దుర్యోధనుడిగా విలక్షణమైన ఇతిహాస పాత్రలో నటించి ఎన్టీఆర్ ఒదిగిపోయిన తీరు.. ఇక తెలుగు ప్రేక్షకుల గుండెల్లో ఆయనకు చెరిగిపోని స్థానాన్ని కల్పించింది. అయితే ఎప్పుడు విభిన్నమైన ప్రయోగాలు చేస్తూ అభిమానులు ఆదరిస్తూ ఉండేవారు సీనియర్ ఎన్టీఆర్. అయితే ఇలా ప్రయోగాలు చేసిన సమయంలో కొన్ని కొన్ని సార్లు వివాదాల్లో చిక్కుకుంటూ ఉంటారు అని చెప్పాలి. అచ్చం ఇలాగే తాతమ్మ కల అనే సినిమాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా సీన్స్ డైలాగ్స్ ఉన్నాయని.. 50 రోజుల తర్వాత ఆ సినిమా బ్యాన్ చేసింది ప్రభుత్వం.
అయితే ఎన్టీఆర్ నటించిన సినిమాలలో యోగి వేమన కూడా ఒకటి. అయితే ఈ సినిమాలోని ఒక సన్నివేశం గురించి మూడేళ్ల పాటు సీనియర్ ఎన్టీఆర్ కోర్టు చుట్టూ తిరిగారట. వేమన క్యారెక్టర్ తన వదినను నగ్నంగా చూసే సీన్ ఒకటి ఉంటుంది. అయితే ఆ సీన్ ఎడిట్ చేయాల్సిందిగా సెన్సార్ బోర్డు కోరింది. కానీ యోగివేమన అలా యోగిగా ఎలా మారాడు అనేదానికి ఆ సీనే ప్రధాన కారణం అని.. శృంగారం కోసమో.. డబ్బులు కోసమో ఈ సీన్ పెట్టలేదని ఎన్టీఆర్ వివరణ ఇచ్చారు. అయినప్పటికీ సెన్సార్ బోర్డు వినకపోవడంతో సెన్సార్ బోర్డుపై కేసు వేసి మూడేళ్ల పాటు కోర్టు చుట్టూ తిరిగారట ఎన్టీఆర్. ఆ తర్వాత రిలీజ్ చేసి బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టారు సీనియర్ ఎన్టీఆర్.