తెలుగు సినీ పరిశ్రమలో దర్శకుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో కొరటాల శివ ఒకరు. ఈయన మిర్చి సినిమాతో కెరీర్ ను మొదలు పెట్టాడు. ఆ తర్వాత శ్రీమంతుడు , జనతా గ్యారేజ్ , భరత్ అనే నేను , ఆచార్య సినిమాలకు దర్శకత్వం వహించాడు. ఇందులో ఆచార్య సినిమాను మినహాయిస్తే అన్ని సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ విజయాలను అందుకున్నాయి. ఇకపోతే ఆచార్య సినిమా మాత్రం ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. తాజాగా కొరటాల , జూనియర్ ఎన్టీఆర్ హీరోగా దేవర అనే మూవీ ని రూపొందించాడు. ఈ సినిమాను సెప్టెంబర్ 27 వ తేదీన విడుదల చేయనున్నారు.
ఆ సందర్భంగా ఈ మూవీ కి సంబంధించిన ట్రైలర్ ను కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ బృందం వారు విడుదల చేశారు. ఈ మూవీ ట్రైలర్ బాగానే ఉన్నప్పటికీ ఈ సినిమా ట్రైలర్ ఆచార్య మూవీ కథకు దగ్గరగా ఉంది అనే నెగటివ్ వార్తలు రాసాగాయి. దానితో కొంత మంది ఇది మరో ఆచార్య రేంజ్ సినిమా అవుతుందా అని భావించారు. ఇక ఇలాంటి సమయం లోనే కొరటాల శివ ఓ ఇంటర్వ్యూలో భాగంగా అలాంటి అనుమానాలు అన్నింటికీ పులిస్టాప్ పెట్టేసాడు.
అసలు విషయం లోకి వెళితే ... తాజాగా కొరటాల శివ ఇంటర్వ్యూ లో భాగంగా మాట్లాడుతూ ... దేవర సినిమా అద్భుతమైన రేంజ్ లో ఉంటుంది. ఇక ఈ సినిమా రొటీన్ కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీల మాదిరి అస్సలు అసలు ఉండదు అని చెప్పాడు. ఇలా కొరటాల "దేవర" సినిమా రొటీన్ కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ ల మాదిరి అస్సలు ఉండదు అని చెప్పడంతో ఈ సినిమా ట్రైలర్ ను బట్టి సినిమాను అంచనా వేయలేము అనే భావనకు చాలా మంది వచ్చారు. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.