కొన్ని సంవత్సరాల క్రితం హీరోలు వరస పెట్టి సిక్స్ ప్యాక్ బాడీ లపై దృష్టిని పెట్టిన సందర్భాలు ఉన్నాయి. వరుసగా స్టార్ హీరోలు 6 ప్యాక్ , 8 ప్యాక్ కండలు అంటూ సినిమాలలో కథకి , సిచువేషన్ కు సంబంధం లేకపోయినా కండలు చూపించడానికి ఎక్కువ ఆసక్తిని చూపించిన సందర్భాలు ఉన్నాయి. దానితో కొంత మంది మీడియం రేంజ్ హీరోలు , చిన్న హీరోలు కూడా కండలు పెంచడంలో అత్యంత ఆసక్తిని చూపించిన సందర్భాలు కూడా ఉన్నాయి. కెరియర్ ప్రారంభంలో ఎన్నో సినిమాల్లో కామెడీ పాత్రలలో నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్న సునీల్ కొంత కాలం క్రితం అందాల రాముడు , మర్యాద రామన్న సినిమాలతో హీరోగా మంచి విజయాలను అందుకున్నాడు.
దానితో ఈయన కొన్ని సంవత్సరాల పాటు కేవలం సినిమాల్లో హీరోగా మాత్రమే నటిస్తూ వచ్చాడు. అందులో భాగంగా పూల రంగడు సినిమా కోసం సునీల్ ఎంతో కష్టపడి సిక్స్ ప్యాక్ బాడీని తెచ్చుకున్నాడు. ఇక పూల రంగడు సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఆ తర్వాత సునీల్ అనేక సినిమాలలోతన సిక్స్ ప్యాక్ బ్యాడిని ప్రదర్శించాడు. కానీ అది పెద్దగా యూస్ కాలేదు. ఇక ప్రస్తుతం సునీల్ సిక్స్ ప్యాక్ బాడీని పూర్తిగా పక్కన పెట్టేసి వచ్చిన అవకాశాలన్నింటినీ సద్వినియోగం చేసుకుంటూ కెరీర్ మంచి జోష్లో ముందుకు సాగిస్తున్నాడు.
కెరియర్ ప్రారంభంలో 8 ప్యాక్ బాడీతో అద్భుతంగా ఆలరించిన వ్యక్తులలో నితిన్ ఒకరు. ఈయన కూడా 8 ప్యాక్ బాడీతో ఎన్నో సినిమాల్లో కనిపించిన వాటి ద్వారా ఏ మాత్రం యూస్ లేకుండా పోయింది. దానితో ఈ యువ నటుడు ప్రస్తుతం ఫిట్ గా ఉంటే సరిపోతుంది అనే ఉద్దేశంతో ఫిట్నెస్ ను మైంటైన్ చేస్తూ మంచి కథలను ఎంచుకొని సినిమాలు చేయడంపై దృష్టి పెట్టాడు.