'దేవర' కోసం.. సముద్రాన్నే సృష్టించిన కొరటాల.. వైరల్ వీడియో?

praveen
ప్రస్తుతం ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా కూడా దేవర మూవీ గురించి టాక్ వినిపిస్తుంది. కొరటాల శివ దర్శకత్వంలో గ్లోబల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన ఈ మూవీ ఈనెల 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది అన్న విషయం తెలిసిందే. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాపై భారీ రేంజ్ లోనే అంచనాలు ఉన్నాయి. అయితే ఏ మూవీలో జూనియర్ ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తూ ఉంది అని చెప్పాలి.

 బాలీవుడ్లో స్టార్ హీరోగా కొనసాగుతున్న సైఫ్ అలీఖాన్ ఏకంగా విలన్ రోల్ లో కనిపించబోతున్నాడు అన్నది తెలుస్తుంది. అయితే రిలీజ్ డేట్ కి సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రస్తుతం దేవర చిత్రబృందం ప్రమోషన్స్ లో బిజీ బిజీగా ఉంది అని చెప్పాలి. ఇకపోతే ఇటీవల స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి  తో దేవర టీమ్ ఒక స్పెషల్ ఇంటర్వ్యూ చేయగా.. ఇక ఇంటర్వ్యూ కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి. అయితే ఈ ఇంటర్వ్యూలో దేవర మేకింగ్ వీడియోలను కూడా చూపించారు. దేవర అనే సినిమా ఎక్కువగా సముద్రం ఒడ్డున జరిగే కథ. దీంతో సినిమా షూటింగ్ అన్నీ కూడా సముద్రం ఉన్న గోవా, గోకర్ణ అండమాన్, థాయిలాండ్ లాంటి ప్రాంతాల్లో షూట్ చేశారు.

 దాదాపుగా సినిమాలోని అరగంట పాటు ఇలా నీళ్లలోనే సాగే యాక్షన్ సన్నివేశం కూడా
ఉంటుందట. అయితే ఇక ఈ ఇంటర్వ్యూలో భాగంగా తారక్ ఈ యాక్షన్స్ సన్నివేశం గురించి చెబుతూ సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేశారు. అయితే ఈ సినిమాకు భారీ బడ్జెట్ పెట్టారు అన్న విషయం తెలిసిందే. ఏకంగా కొరటాల శివ దేవర కోసం సముద్రాన్ని సృష్టించాడు. సముద్రాన్ని సృష్టించడమేంటి అనుకుంటున్నారు కదా. సముద్రంలో తీసే యాక్షన్ సన్నివేశాలకు తగ్గట్లు పెద్ద పూల్ నీ డిజైన్ చేశారు. నీళ్లలో ఉండే ఫైట్ సీన్స్ అని కూడా ఇక్కడే షూట్ చేశారు. 35 రోజులు పాటు ఈ పూల్లోనే షూటింగ్ జరిగిందట. దేవర ఇంటర్వ్యూలో మేకింగ్ వీడియో చూస్తే ఇక ఈ సినిమా కోసం తారక్ ఎంత కష్టపడ్డారో అర్థమవుతుంది.

https://x.com/SureshPRO_/status/1835203484263891106?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1835203484263891106%7Ctwgr%5E8b0c8ef0f852c951f837d361cd1db6f7c6dd6177%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fapi-news.dailyhunt.in%2F

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: