ఈ మధ్య కాలంలో స్టార్ హీరోలు నటించే సినిమాలకు బడ్జెట్ భారీగా పెరిగిపోతున్న విషయం మన అందరికీ తెలిసిందే. బడ్జెట్ భారీగా పెరిగిపోతున్న నేపథ్యంలో స్టార్ హీరోలకు సంబంధించిన సినిమాలు భారీ టికెట్ ధరలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. టికెట్ ధరలను ఇష్టానుసారంగా పెంచే అవకాశం లేదు. దానికి ప్రభుత్వం కచ్చితంగా అంగీకారం తెలుపవలసి ఉంది. దానితో స్టార్ హీరోల సినిమాలను నిర్మించిన నిర్మాతలు రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్య మంత్రులను కలవడం , వారికి ఆ సినిమాకు సంబంధించిన అనేక విషయాల గురించి చెప్పడం , దానికి వారు కన్విన్స్ అయినట్లు అయితే సినిమా టికెట్ ధరలను పెంచే వెసులుబాటును కల్పిస్తున్నారు.
ఇరు రాష్ట్రాల ముఖ్య మంత్రులను కలవడం , వారికి పరిస్థితులను వివరించడం , ఆ తర్వాత వారు అంగీకరించి టికెట్ ధరలను పెంచేందుకుగాను అనుమతిని ఇవ్వడం ఇదంతా జరిగే సరికి ఆల్మోస్ట్ విడుదల తేదీ అత్యంత దగ్గరగా వచ్చేస్తుంది. దానితో ఈ మధ్య కాలంలో టికెట్ ధరలను పెంచిన స్టార్ హీరోలకు సంబంధించిన సినిమా టికెట్ బుకింగ్స్ మూవీ విడుదలకు ఒకటి లేదా రెండు రోజుల ముందు ఓపెన్ అయిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. అందుకు ఉదాహరణగా ఈ మధ్య కాలంలో ప్రభాస్ నటించిన చాలా సినిమాల బుకింగ్స్ విడుదలకు చాలా తక్కువ రోజుల ముందే ఓపెన్ అయ్యాయి. జూనియర్ ఎన్టీఆర్ తాజాగా దేవర సినిమాలో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమా భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీగా రూపొందింది. ఈ సినిమా టికెట్ ధరలను కూడా భారీగానే పెంచనున్నారు.
ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన టికెట్ ధరలను పెంచేందుకు రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అనుమతిని ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. దానితో ఈ సినిమాకు సంబంధించిన ఆన్లైన్ టికెట్ బుకింగ్స్ ను ఈ మూవీ విడుదలకు చాలా రోజుల ముందే ఓపెన్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇలా ఇతర స్టార్ హీరోల విషయంలో జరిగిన పొరపాటున దేవర సినిమా విషయంలో జరగకుండా ఎన్టీఆర్ ముందే జాగ్రత్త పడినట్లు తెలుస్తోంది.