సినిమా ఇండస్ట్రీ లో ఒకరు రిజెక్ట్ చేసిన కథతో మరొ కరు సినిమా చేయడం అనేది చాలా సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది. తాజాగా సుహస్ "జనక అయితే గనక" అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించాడు. ఈ మూవీ కి సందీప్ బండ్ల దర్శకత్వం వహించాడు. ఈ సినిమాను సెప్టెంబర్ 7 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అందుకు ఒక రోజు ముందు ఈ సినిమా ప్రీమియర్ షో లను కూడా ప్రదర్శించనున్నట్లు అధికారిక ప్రకటన విడుదల చేశారు.
కానీ ఆ తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీగా వర్షాలు కురవడం , అనేక ప్రాంతాలు వరదల్లో చిక్కుకుపోవడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితులు బాగో లేకపోవడంతో ఈ సినిమా విడుదలను పోస్ట్ పోన్ చేశారు. ఇకపోతే ఈ మూవీ ని అక్టోబర్ 11 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ కొన్ని రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించారు. ఇకపోతే ఈ సినిమాలో హీరోగా మొదటి ఆప్షన్స్ సుహస్ కాదట. ఒక హీరోకు కథను వినిపించగా ఆయన వద్దనడంతో ఈ సిన అవకాశం సుహస్ కి వచ్చిందట. అసలు విషయం లోకి వెళితే ... ఈ సినిమా దర్శకుడు అయినటువంటి సందీప్ బండ్ల మొదటగా ఈ సినిమా కథను నాగ చైతన్య కు వినిపించాడట.
కథ మొత్తం విన్న నాగక్చైతన్య కు స్టోరీ సూపర్ గా నచ్చు కొంత కాలం పాటు దర్శకుడితో ట్రావెల్ కూడా చేశాడట. కానీ ఆ తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ సినిమా చేయలేకపోయాడట. దానితో దర్శకుడు సుహస్ ను సంప్రదించడం , ఈ కథ వినిపించడం , ఆయన ఈ కథ విని వెంటనే దానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిందట. అలా మొదట నాగ చైతన్య ను అనుకున్న ఆ తర్వాత ఆయన తప్పుకోవడంతో ఈ సినిమాలో సూహస్ నటించినట్లు తెలుస్తోంది.