ప్రియుడికి షాక్.. ఆ కోరిక తీర్చలేనంటున్న తమన్నా?

Veldandi Saikiran
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోయిన్లు ఉన్నప్పటికీ హీరోయిన్ తమన్నా భాటియాకు ఉన్న క్రేజ్ అంతా కాదు. ఇండస్ట్రీలోకి తమన్నా వచ్చి దాదాపు 15 ఏళ్లు దాటిపోయింది. అయినప్పటికీ ఇండస్ట్రీలో అడుగుపెట్టినప్పుడు తమన్నా ఎలా ఉందో ఇప్పుడు కూడా మరింత అందంగా తయారైంది.అందుకే ఆమెకు మిల్కీ బ్యూటీ అని పేరు వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. హ్యాపీడేస్ లాంటి.. కాలేజీ సినిమాతో.. తెలుగు ఇండస్ట్రీలో బాగా పాపులర్ అయింది తమన్నా.
 

ఆ తర్వాత వరుసగా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న పెద్ద పెద్ద హీరోలతో సినిమాలు చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది మిల్కీ బ్యూటీ తమన్న. అదే సమయంలో బాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలలో కూడా దుమ్ము లేపుతోంది హీరోయిన్ తమన్నా. అటు వెబ్ సిరీస్లలో కూడా... హాట్ సీన్లు చేసి రచ్చ లేపుతోంది. ముఖ్యంగా ఐటమ్ సాంగ్లు చేసి... దేశవ్యాప్తంగా హీరోయిన్  మిల్కీ బ్యూటీ తమన్న పాపులర్ అవుతున్నారు.
 

టాలీవుడ్ ఇండస్ట్రీలో రకుల్ ప్రీత్ సింగ్ కాజల్ నయనతార సమంత లాంటి హీరోయిన్లు ఉన్నప్పటికీ... వారందరి కంటే ఒక  మెట్టు పైననే ఉంటుంది ఈ తమన్నా.అంతేకాదు వారందరూ పెళ్లి చేసుకున్న కూడా బ్యాచిలర్ లైఫ్ ఎంజాయ్ చేస్తోంది హీరోయిన్ తమన్నా. అయితే ప్రస్తుతం బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో రిలేషన్ లో ఉంది హీరోయిన్ తమన్నా. అయితే వీరిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలో సోషల్ మీడియాలో ప్రతిసారి వార్తలు వస్తూనే ఉన్నాయి.
 

అయితే బాలీవుడ్ నటుడు విజయ వర్మను పెళ్లి చేసుకున్న తర్వాత...కచ్చితంగా తమన్న పిల్లలు కనాల్సి ఉంటుంది. అయితే తాను మాత్రం పిల్లలను కనలేనని.. తాజాగా ఓ ఈవెంట్లో తమన్నా పేర్కొందట. పిల్లలను కనడం వారిని పోషించడం చాలా కష్టమని చెప్పుకొచ్చిందట. తనకు పుట్టబోయే పిల్లలకు ప్రేమ అలాగే కేరింగ్ అస్సలు నేను పంచలేనని... అది తన వల్ల కాదని చెప్పుకొచ్చింది. ఒకవేళ పిల్లలు పుడితే ఏం జరుగుతుందో అనే భయం కూడా ఉందని వివరించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: