50 రోజుల్లోనే అలాంటి రికార్డును సొంతం చేసుకున్న రాజ్ తరుణ్.. వరుసగా మూడు అనుభవాలు..?

MADDIBOINA AJAY KUMAR
ఈ మధ్య కాలంలో హీరోలంతా ఒక్కో సినిమా విడుదల చేయడానికి సంవత్సరాల కాలం తీసుకుంటున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇక మీడియం రేంజ్ హీరోలు , కాస్త తక్కువ ఈమేజ్ కలిగిన హీరోలు సంవత్సరానికి ఒకటి , రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఇకపోతే పర్వాలేదు అనే స్థాయి క్రేజ్ ను తెలుగు సినీ పరిశ్రమల సంపాదించుకున్న రాజ్ తరుణ్ మాత్రం కేవలం 50 రోజుల్లోనే మూడు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కానీ అందులో ఏ ఒక్క సినిమా కూడా ప్రేక్షకులను కనీసం ఆకట్టుకోలేదు.

మొదటగా ఈ సంవత్సరం రాజ్ తరుణ్ హీరో గా రూపొందిన పురుషోత్తముడు సినిమా థియేటర్లలో విడుదల అయింది. ఈ సినిమా జూలై 26 వ తేదీన థియేటర్లలో విడుదల అయింది. ఇక ఈ సినిమా మహేష్ బాబు హీరోగా రూపొందిన శ్రీమంతుడు సినిమాకు అటు ఇటుగా ఉన్నప్పటికీ ఈ మూవీ ని ప్రేక్షకులు ఎవరు పెద్దగా పట్టించుకోలేదు. దానితో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ డిజాస్టర్ అయ్యింది. ఇలా పురుషోత్తముడు సినిమాతో భారీ డిజాస్టర్ ను బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్న రాజ్ తరుణ్ ఆ తర్వాత చాలా తక్కువ కాలంలోనే తిరగబడరా సామి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇక ఈ సినిమాను చూడడానికి ప్రేక్షకులు ఏమాత్రం ఉత్సాహాన్ని చూపలేదు. దానితో ఈ మూవీ కూడా ఘోరమైన పరాజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంది.

ఇకపోతే తాజాగా సెప్టెంబర్ 13 వ తేదీన రాజ్ తరుణ్ హీరోగా రూపొందిన భలే ఉన్నాడే సినిమా థియేటర్లలో విడుదల అయింది. ఈ సినిమాకు కూడా ప్రేక్షకుల నుండి ఎలాంటి రెస్పాన్స్ దక్కడం లేదు. ఈ మూవీకు పెద్దగా కలెక్షన్లు కూడా రావడం లేదు. దానితో ఈ సినిమా కూడా డిజాస్టర్ కావడం ఖాయంగా కనబడుతుంది. దానితో కేవలం 50 రోజుల్లోనే మూడు ఫ్లాప్ లను రాజ్ తరుణ్ అందుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: