ఎయిర్ పోర్ట్ లో సితార తో కలిసి మహేష్ బాబు.. లుక్ చూసారా..!

Anilkumar
RRR సినిమా తర్వాత దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి... టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఓ ప్రతిష్టాత్మక చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. పాన్ వరల్డ్ మూవీగా ఆ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాపై దేశ వ్యాప్తంగా ఓ రేంజ్లో బజ్ క్రియేట్ అయ్యింది. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు కొనసాగుతున్నాయి.  ఇక ఈ క్రేజీ ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటి వరకు ‘SSMB29’గా పిలుస్తూ వస్తున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ లో 29వ సినిమాగా తెరకెక్కడంతో ఈ పేరు వాడుతున్నారు. అయితే, ఇప్పుడు వర్కింగ్ టైటిల్ కాస్త మార్పులు చేశారు రాజమౌళి. ‘SSMB 29’ని ‘SSRMB’గా ఛేంజ్ చేశారు. అంటే,

 ఎస్ ఎస్ రాజమౌళి, మహేష్ బాబు పేర్లు కలిపి వచ్చేలా ఈ నిర్ణయం తీసుకున్నారు. హీరోతో పాటు దర్శకుడికి సమాన క్రెడిట్ వచ్చేలా మార్పులు చేశారు.   ఇక ఈ విషయం కాసేపు పక్కన పెడితే మహేష్ బాబు గత కొన్ని వారాలుగా అమెరికాలో ఉంటున్నాడు. కుటుంబ సభ్యులతో హాలీడేస్ ను ఎంజాయ్ చేయడంతో పాటు, తనయుడు గౌతమ్ కృష్ణ కు ప్రతిష్టాత్మక ఫిల్మ్‌ ఇనిస్టిట్యూట్‌ లో అడ్మిషన్ కోసం కూడా మహేష్ బాబు ఇన్ని రోజులుగా అమెరికాలో ఉంటున్నాడు అనే వార్తలు వస్తున్నాయి. ఎట్టకేలకు యూఎస్ నుంచి మహేష్ బాబు రావడంతో మీడియా దృష్టిని ఆకర్షించారు. ఎయిర్‌ పోర్ట్‌ లో సితారతో కలిసి మహేష్ బాబు కనిపించి

 అందరి దృష్టిని ఆకర్షించాడు. గతంలో ఎప్పుడూ లేనంత గడ్డంతో మహేష్ బాబు తాజా ఫోటోల్లో కనిపిస్తున్నాడు అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. తాజాగా ఎయిర్‌ పోర్ట్‌ లో కనిపించిన మహేష్ బాబు గుబురు గడ్డంతో పాటు, పొడవైన జుట్టు తో కనిపించాడు. కొత్త లుక్ కి ఫ్యాన్స్ తో పాటు ప్రతి ఒక్కరు ఫిదా అవుతున్నారు. సోషల్‌ మీడియాలో మహేష్ బాబు ఫోటోలు తెగ వైరల్‌ అవుతున్నాయి. సితార కూడా పెద్ద పాప అయింది అంటూ ఈ ఫోటోలను చూసి కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఫిల్మ్‌ స్కూల్‌ లో మహేష్ బాబు తన కుమారుడు గౌతమ్ కృష్ణ ను జాయిన్‌ చేసిన నేపథ్యంలో ముందు ముందు సితార ను కూడా యాక్టింగ్ స్కూల్ కి పంపిస్తే బాగుంటుంది అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: