ఛత్రపతి ఇంటర్వెల్ సీన్ గురించి పచ్చి నిజాలు బయట పెట్టిన ప్రభాస్..!?

Anilkumar
రెబల్ స్టార్ ప్రభాస్ మార్కెట్ బాహుబలితో గ్లోబల్ రేంజ్ కు చేరింది. ప్రభాస్ నటించే ఈ సినిమా అయిన పాన్ ఇండియా భాషల్లో వస్తుంది. తాజాగా కల్కి తో రూ. 1100 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి తన సినిమా స్టామినా ఏంటో మరోసారి చూపించాడు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు ప్రభాస్. కల్కి సెట్స్ పై ఉండగానే  రెండు సినిమాలను గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు రెబల్. అందులో ఒకటి హాస్యం ప్రదానంగా ఉండే కథాంశంతో సినిమాలు తెరకెక్కించే మారుతి దర్శకత్వంలో ‘ది రాజా సాబ్’ సినిమా  పట్టాలెక్కించాడు. ప్రస్తుతం హైదరాబాద్‌ పరిసరాల్లో ప్రభాస్, కథానాయికలు, కొద్దిమంది హాస్యనటులపై కీలక

 సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. ముగ్గురి హీరోయిన్లు. ప్రభాస్ నడుమ హుషారైన సన్నివేశాలు చిత్రీకరస్తున్న దర్శకుడు మారుతి. వినాయక చవితి ఫెస్టివల్ నాడు కూడా విరామం లేకుండా, ఆదివారం కూడా బ్రేక్ లేకుండా అన్ స్టాపబుల్ గా రాజా సాబ్ షూటింగ్ జరుగుతుంది.  అయితే సాధారణంగా ప్రభాస్‌ వేదికలపై పెద్దగా మాట్లాడరు. విలేకరుల సమావేశంలోనూ మైక్‌ను పట్టుకోవడానికి కూడా తటపటాయిస్తుంటారు. కెరీర్‌ తొలినాళ్లలో షూటింగ్‌లోనూ ఇలాగే ఇబ్బంది పడేవారట. ప్రభాస్‌, రాజమౌళి కాంబినేషన్‌లో వచ్చిన 'ఛత్రపతి' చిత్రీకరణలోనూ ఇలాంటి సంఘటనే చోటు చేసుకుంది. బాజీరావును చంపేసిన తర్వాత ప్రభాస్‌

 అతడి శవాన్ని ఈడ్చుకెళ్లి రాజకీయ నాయకుడైన అప్పలనాయుడు (కోట శ్రీనివాసరావు)కు వార్నింగ్‌ ఇస్తాడు. అప్పుడు సెట్‌లో ప్రభాస్‌ డైలాగ్‌లే చెప్పలేదట. కేవలం పెదవులు మాత్రమే కదిపారట. ఇక ఇందులో భాగంగానే ప్రభాస్ మాట్లాడుతూ ''ఇంటర్వెల్‌ షాట్‌లో జనాన్ని ఉద్దేశించి మాట్లాడాలి. ఒకపక్క వర్షం. పైగా చలి. రాజమౌళి దగ్గరకు వెళ్లి 'డార్లింగ్‌ డైలాగ్‌ గట్టిగా చెప్పలేను. సైలెంట్‌గా చెబుతాను' అని అనడంతో జక్కన్న కూడా ఓకే అన్నారు. ఆ షాట్‌లో కేవలం పెదాలు కదిపానంతే. అక్కడున్న వాళ్లకు నేను ఏ చేస్తున్నానో అర్థం కాలేదు. షాట్‌ ఓకే అయిపోయింది. జనం ఉంటే ఎందుకో సైలెంట్‌ అయిపోతా. 'మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌' చేస్తున్నప్పుడు కూడా విశ్వనాథ్‌గారు సెట్‌లో ఉండగా ఇలాగే సైలెంట్‌గా డైలాగ్‌లు చెప్పేవాడిని... అంటూ ప్రభాస్‌ ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: