స్టన్నింగ్ లుక్ కోసం కష్టపడుతున్న రాంచరణ్..ఆ సినిమా కోసమేనా..?

frame స్టన్నింగ్ లుక్ కోసం కష్టపడుతున్న రాంచరణ్..ఆ సినిమా కోసమేనా..?

murali krishna
గ్లోబల్ స్టార్ ‘రామ్ చరణ్’.. ప్రస్తుతం ఈ హీరో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ‘గేమ్ ఛేంజర్’ మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. కాగా, ఈ సినిమాకి డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు.ఇకపోతే ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా.. అంజలి కూడా మరో హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే ఈ భారీ బడ్జెట్ సినిమాకు దిల్ రాజ్ ప్రొడ్యూసర్ గా నిర్మిస్తున్నారు. అయితే గేమ్ ఛేంజర్ మూవీలో చరణ్ రెండు విభిన్న పాతత్రల్లో కనిపించనున్నాడు. కాగా,అందులో ఒకటి తండ్రి పాత్రగా.. రెండవది కొడుకుగా చేయనున్నారు.ఇకపోతే ఈ సినిమాలో నవీన్ చంద్ర , సునీల్, సముద్రఖని వంటి తదితరులు నటించనున్నారు. ఇక ప్రస్తుతానికి రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ మూవీ ఇంక షూటింగ్ దశలోనే ఉంది. దీంతో చరణ్ ఫ్యాన్స్ ఎప్పుడు ఈ సినిమా రిలీజ్ అవుతుందా అని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.కానీ, శంకర్ ప్రస్తుతం కమలహాసన్ ఇండియన్ 2 సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే గేమ్ ఛేంజర్ మూవీ షూటింగ్ కాస్త ఆలస్యం అవుతూ వచ్చింది. ఇక భారతీయుడు మూవీ షూటింగ్ కూడా చివరి దశలో పూర్తి కావొచ్చింది. కాబట్టి, రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ మూవీని మరో వారం పది రోజుల్లో ఈ సినిమా షూటింగ్ పూర్తి కానుంది. అయితే ఈ షూటింగ్ పూర్తవ్వగానే రామ్ చరణ్ తన ఫ్యామిలీతో వెకెషన్స్ కి వెళ్లానున్నారు. ఇక ఆ వెకెషన్స్ పూర్తి చేసుకున్న వెంటనే..  రామ్ చరణ్ ఉప్పెన ఫేమ్ బుచ్చి బాబు దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నాడు. ఇక ఈ సినిమా స్పోర్ట్స్ నేపథ్యంలో తెరకెక్కనున్నట్లు సమాచారం.

ఇదిలావుండగా గేమ్‌ ఛేంజర్ విడుదలకు ముందే బుచ్చిబాబు దర్శకత్వంలో సినిమాను చేసేందుకు చరణ్ రెడీ అయ్యాడు. స్పోర్ట్స్ డ్రామాగా రూపొందబోతున్న ఆ సినిమా కోసం చరణ్ ప్రస్తుతం ఆస్ట్రేలియాలో కఠోర శ్రమ పడుతున్నట్లుగా మెగా కాంపౌండ్‌ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.ఈ నెల ఆరంభంలో రామ్‌ చరణ్‌ ఆస్ట్రేలియాకు వెళ్లాడు. పక్కా అథ్లెటిక్ లుక్ కోసం చరణ్‌ అక్కడ ప్రత్యేక శిక్షణ పొందుతూ, కఠోర శ్రమ పడుతూ వర్కౌట్‌ లు చేస్తున్నాడట. అంతర్జాతీయ స్థాయి అథ్లెట్స్ కి ట్రైనింగ్ ఇచ్చే ప్రముఖ ట్రైనర్ వద్ద చరణ్‌ ప్రస్తుతం వర్కౌట్స్ చేస్తున్నాడు. నాలుగు వారాల వర్కౌట్స్ తర్వాత చరణ్‌ ఇండియాకు రాబోతున్నాడు. చరణ్ తిరిగి వచ్చిన వెంటనే బుచ్చిబాబు సినిమా ను మొదలు పెట్టాలని ప్రీ ప్రొడక్షన్ వర్క్ చేస్తున్నాడు. గత కొన్ని రోజులుగా హైదరాబాద్‌ శివారు ప్రాంతంలో ఒక భారీ పల్లెటూరు సెట్‌ ను నిర్మాణం చేస్తున్నారు.కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న ఆ సెట్‌ లోనే సినిమాకు సంబంధించిన మెజార్టీ సన్నివేశాలను చిత్రీకరించబోతున్నారు. అందుకే ఆ సెట్‌ పై అత్యంత జాగ్రత్తలు తీసుకుంటూ నిర్మాణం చేస్తున్నారని సమాచారం అందుతోంది. రామ్ చరణ్‌ ను ఒక పల్లెటూరు అథ్లెట్‌ గా దర్శకుడు బుచ్చిబాబు ఈ సినిమాలో చూపించబోతున్నాడు. నిజ జీవిత సంఘటనల ఆధారంగా కల్పిత పాత్రలతో, సినిమాటిక్ గా రూపొందబోతున్న ఈ సినిమాలో చరణ్ లుక్‌ చాలా స్పెషల్‌ గా ఉంటుందని మెగా ఫ్యామిలీ సన్నిహితులతో పాటు, చిత్ర యూనిట్‌ సభ్యులు చాలా నమ్మకంగా చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: