సమంతని రహస్యంగా కిడ్నాప్ చేసిన నిర్మాత..?

Pandrala Sravanthi
స్టార్ హీరోయిన్ సమంతకి సౌత్ ఇండస్ట్రీలో ఎంతమంది అభిమానులు ఉన్నారో చెప్పనక్కర్లేదు.ఈ హీరోయిన్ నటనకి కేవలం సామాన్య ప్రేక్షకులే కాదు హీరోలు సైతం ఫిదా అయ్యారు. అలా ఇప్పటికే రామ్ చరణ్, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోలు కూడా యాక్టింగ్ లో సమంత అంటే మాకు ఇష్టం అని సమంత గురించి గొప్పగా చెబుతారు. అలాగే రామ్ చరణ్ అయితే తన ముందు బాలీవుడ్ లో ఉన్న ఇద్దరు హీరోయిన్లు ఉన్నా కూడా తనకి సమంత యాక్టింగ్ అంటేనే ఇష్టం అని రీసెంట్ గా గేమ్ చేంజర్ సినిమా ప్రమోషన్స్ లో చెప్పిన సంగతి మనకు తెలిసిందే.అయితే అలాంటి సమంతపై అప్పట్లో ఓ రూమర్ వినిపించింది. అదేంటంటే..టాలీవుడ్ లో ఉండే ఓ బడా ప్రొడ్యూసర్ సమంత కిడ్నాప్ చేశారని.. మరి ఇంతకీ అప్పట్లో వినిపించిన ఆ రూమర్ లో ఎంత నిజం ఉంది..నిజంగానే సమంతని ఆ నిర్మాత కిడ్నాప్ చేశారా అనేది ఇప్పుడు చూద్దాం.. 

సమంత సౌత్ ఇండస్ట్రీలో ఎన్నో సినిమాల్లో నటించింది.అలా ఈమెకి టాలీవుడ్ లో ఎనలేని క్రేజ్ ఉంది.సౌత్ లో ఎనలేని ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది. అయితే ప్రస్తుతం సౌత్ అంత ఆఫర్స్ లేకపోయినప్పటికీ ఆమెకున్న అభిమానులు మాత్రం ఎక్కడికి పోరు. ఎందుకంటే ఎన్నిసార్లు సర్వే చేసినా కూడా ఎక్కువ ఇష్టపడే హీరోయిన్ ఎవరు అంటే సమంతనే ఫస్ట్ ప్లేస్ లో ఉంటుంది. అయితే అలాంటి సమంతని టాలీవుడ్ లో ఉండే ఓ బడా ప్రొడ్యూసర్ అప్పట్లో కిడ్నాప్ చేసారనే రూమర్ వినిపించింది. ఇక సమంత, జూనియర్ ఎన్టీఆర్,శృతిహాసన్ కాంబినేషన్లో రామయ్య వస్తావయ్య సినిమా వచ్చిన సంగతి మనకు తెలిసిందే.

అయితే ఈ సినిమా భారీ అంచనాలతో వచ్చి డిజాస్టర్ అయింది. అయితే ఈ సినిమా ఫలితం పక్కన పెడితే సినిమా షూట్ సమయంలో ఓ నిర్మాత సమంత దగ్గరికి వచ్చి నెక్స్ట్ సినిమాలో  మీరు హీరోయిన్ గా  చేయాలి అని చెప్పారట.దానికి సమంత కూడా ఓకే చేసిందట. అయితే ఆ తర్వాత వేరే సినిమాల్లో బిజీగా ఉండడం వల్ల సమంత ఇచ్చిన మాట తప్పడంతో ఆ నిర్మాత సమంతని కిడ్నాప్ చేసి తన ఫామ్ హౌస్ లో పెట్టాడనే రూమర్ వినిపించింది. కానీ ఇందులో ఎంత నిజం ఉంది అనేది మాత్రం తెలియదు. అయితే అప్పటి రూమర్ మళ్ళీ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: