రకుల్ ప్రీత్ : నాకు ఎంతో ఇష్టమైన స్టార్ హీరో అతనే..!!

frame రకుల్ ప్రీత్ : నాకు ఎంతో ఇష్టమైన స్టార్ హీరో అతనే..!!

murali krishna
తెలుగు, త‌మిళ భాష‌ల్లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు వ‌న్ ఆఫ్ ది లీడింగ్ హీరోయిన్‌గా మారిపోయింది ర‌కుల్ ప్రీత్ సింగ్. ఈ భామ బాలీవుడ్ లోకి కూడా అడుగుపెట్టి అక్క‌డ కూడా త‌న ఫాలోవ‌ర్ల‌ను పెంచుకునే ప‌నిలో ప‌డ్డ‌ది.ఒకప్పుడు తెలుగులో టాప్ హీరోయిన్‌గా రకుల్ ప్రీత్ సింగ్ ఓ వెలుగు వెలిగిన సంగతి అందరికి తెలిసిందే. మహేష్ బాబు, ఎన్టీఆర్ , అల్లు అర్జున్, రామ్ చరణ్ వంటి స్టార్ హీరోల సరసన నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో నెంబర్ వన్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన రకుల్.. వరుస ఫ్లాపులతో డీలా పడిపోయింది. కోలీవుడ్, బాలీవుడ్‌లో కొన్నిసినిమాల్లో నటించినప్పటికీ అక్కడ ఆమెకు సరైన హిట్ మాత్రం దక్కలేదు. దీంతో రకుల్‌కు అవకాశాలు తగ్గిపోయాయి.ఇదే సమయంలో రష్మిక, పూజా హెగ్డె, శ్రీలీల వంటి స్టార్స్ ఇండస్ట్రీలోకి దూసుకురావడంతో రకుల్ రేసులో వెనుకపడిపోయింది. ఫొటో షూట్లు, జిమ్ వీడియోలతో గ్లామర్‌గా కనిపించినా కూడా ఫలితం లేకుండా పోయింది. రకుల్ సినిమాల్లో కనిపించి రెండేళ్లు కావొస్తోందంటే ఆమె పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక రకుల్ వ్యక్తిగత జీవితానికి వస్తే... జాకీ భగ్నానీ అనే వ్యక్తితో రకుల్ ప్రేమాయణం సాగించిందిరెండేళ్లు డేటింగ్ చేసిన వీరిద్దరు ఈ ఏడాది ఫిబ్రవరి 21 పెళ్లి చేసుకని ఒకటైయ్యారు. రకుల్ చేతిలో ప్రస్తుతం ఒక్క సినిమా కూడా చేతిలో లేకపోవడం విశేషం. అయినప్పటికి సోషల్ మీడియాలో మాత్రం ఈ భామ ఎప్పుడు యాక్టివ్‌గానే ఉంటోంది. జిమ్‌కు వెళ్తోన్న వీడియోలు, లేటెస్ట్ ఫొటోలను తన సోషల్ మీడియా అకౌంట్‌లో షేర్ చేస్తుంటుంది. తాజాగా తన లేటెస్ట్ ఫొటో‌షూట్‌ను పోస్ట్ చేసింది.
ఇదిలావుండగా స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేసారు. తనకెంతో ఇష్టమైన వ్యక్తి అల్లు అర్జున్ అని ఓ ఇంటర్వ్యూ లో చెప్పారు. సరైనోడు మూవీ షూటింగ్ సమయం లో అల్లు అర్జున్ నాతో మాట్లాడుతూ తెలుగు చిత్ర పరిశ్రమను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్ళాలనుకుంటున్నా అని చెప్పారు.ఆ మాటలు నిజం చేసేందుకు ఫోకస్ తో పని చేసారు.పుష్పతో ఏంతో ప్రేమను పొందారు అని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: