OTT: వెన్నులో వణుకు పుట్టించే బెస్ట్ హర్రర్ చిత్రం.. డిమోంటి కాలనీ-2 ఎప్పుడంటే..?
మొదటి భాగం సూపర్ హిట్ కావడంతో రెండవ భాగం ఎంత అద్భుతంగా తెరకెక్కించారు. ఆగస్టు 15వ తేదీన తమిళంలో చాలా గ్రాండ్గా విడుదలైన ఈ సినిమా మొదటి రోజు మంచి హిట్ టాక్ ని సంపాదించుకుంది.ఆ తర్వాత ఒక వారానికి ఆగస్టు 23న తెలుగులో విడుదలయింది. ఇక్కడ కూడా సూపర్ రెస్పాన్స్ రావడంతో ఈ సినిమా ఓటీటీ ప్రేక్షకులు చాలా ఎక్సైటింగ్గా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రాన్ని డైరెక్టర్ అజయ్ జ్ఞానమూర్తి ఎంతో అద్భుతంగా తెరకెక్కించారని హర్రర్ థ్రిల్లర్స్ సన్నివేశాలు కూడా ప్రేక్షకులను మెప్పించాయి.
ప్రియా భవాని శంకర్, అరుల్ నిధి, అర్చన రవిచంద్రన్, అరుణ్ పాండియన్ తదితరులు సైతం ఇందులో కీలకమైన పాత్ర లో నటించారు. థియేటర్లో మెప్పించిన డిమాంటి కాలనీ-2 చిత్రం ఇప్పుడు ఓటీటీలోకి రాబోతోందట .ఈ సినిమా హక్కులను Zee -5 సొంతం చేసుకున్నది ఈనెల 20వ తేదీ లేకపోతే 27వ తేదీ ఓటీటీలో రాబోతున్నట్లు సమాచారం. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించి అధికారికంగా ప్రకటన కూడ త్వరలోనే రాబోతున్నది. అయితే ఈ సినిమా ఒంటరిగా చూడడానికి చాలామంది భయపడినట్లుగా కూడ తెలుస్తోంది. కొన్ని సన్నివేశాలు హర్రర్ నేపథ్యంలో కూడి ఉన్నాయి. ఈ సినిమా చూసిన వారందరూ కూడా వెన్నెలు వణుకు పుట్టించేలా ఉందంటూ కామెంట్స్ చేశారు.