ఆ విషయంలో ఆచార్య ని కూడా బీట్ చేయలేకపోయిన దేవర.. మరి అంత తేడాతో..?

MADDIBOINA AJAY KUMAR
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా రూపొందిన దేవర సినిమాని సెప్టెంబర్ 27 వ తేదీన విడుదల చేయనున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే ఈ సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా ఈ మూవీ యొక్క ట్రైలర్ ను ఈ మూవీ బృందం వారు విడుదల చేశారు. ఈ సినిమా ట్రైలర్ విడుదల అయినప్పటి నుండి ఈ ట్రైలర్ పై అనేక ట్రోల్స్ జరుగుతున్నాయి. ఆఖరుగా కొరటాల శివ "ఆచార్య" అనే సినిమాకు దర్శకత్వం వహించాడు. ఆ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ అపజయాన్ని అందుకుంది. ఇక ఆచార్య సినిమా కంటే ముందు ఈయన దర్శకత్వం వహించిన ప్రతి మూవీ కూడా బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది.

కెరియర్ లో ఒక ఫ్లాప్ ను కొరటాల అందుకున్న అది భారీ అభయాన్ని అందుకుంది. ఇకపోతే ఆచార్య లాంటి పెద్ద ప్లాప్ తర్వాత కొరటాల , జూనియర్ ఎన్టీఆర్ హీరోగా దేవర అనే సినిమాను మొదలు పెట్టాడు. ఈ మూవీ ని ఏకంగా రెండు భాగాలుగా విడుదల చేయనున్నారు. అందులో మొదటి భాగాన్ని సెప్టెంబర్ 27 వ తేదీన రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమా ట్రైలర్ కు కాస్త మిక్స్డ్ టాక్ రావడంతో ఈ మూవీ ట్రైలర్ భారీ ఎత్తున రికార్డులను సృష్టించలేక పోయింది.

మరి ముఖ్యంగా ఈ సినిమా ట్రైలర్ ఆచార్య రికార్డును కొట్టలేకపోయింది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందిన ఆచార్య ట్రైలర్ కు విడుదల అయిన 24 గంటల సమయంలో 838 కే లైక్స్ లభించగా , దేవర మూవీ ట్రైలర్ కి విడుదల అయిన 24 గంటల్లో కేవలం 650 లైక్స్ లభించాయి. ఇలా చూసుకున్నట్లు అయితే 24 గంటల్లో వచ్చిన లైక్స్ విషయంలో దేవర మూవీ ఆచార్య ను దాటలేకపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: